పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan ) అంటే అభిమానుల్లో ఏదో తెలియని ఉత్సాహం ఉంటుంది.మరీ ముఖ్యంగా ఈయన కోసం ఎంతో మంది అభిమానులు గొడవలు కూడా పెట్టుకుంటారు.
ఇక అప్పట్లో అయితే ముఖాముఖి గొడవలు పెట్టుకునే వారు.కానీ ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియా వేదికగా చేసుకొని మా హీరో గొప్ప అంటే మా హీరో గోప్పా అని సోషల్ మీడియా ద్వారా తిట్టుకుంటున్న సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎవరైనా సరే ఏమన్నా అంటే అస్సలు ఊరుకోరు.మరీ ముఖ్యంగా ఆయన మాజీ భార్యని కూడా ఆయన విషయంలో ఏదైనా తప్పుగా మాట్లాడినా ఆయన కొడుకు విషయంలో తప్పుగా మాట్లాడిన సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏకీపారిస్తారు.
అలాంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ( Pawan Kalyan Fans ) ఆయన కోసం ఏ పని చేయడానికి అయినా సిద్ధమవుతారు.అయితే ఓ వీరాభిమాని కూడా పవన్ కళ్యాణ్ కోసం అలాంటి పనే చేశారట.
ఏకంగా అప్పట్లోనే 20 లక్షలు అప్పుచేసి అలాంటి పని చేశారట.మరి ఇంతకీ 20 లక్షలు అప్పుచేసి పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన ఆ పని ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతి ఒక్కరికి కొత్త ఊపునిస్తుంది.చిన్న నుండి పెద్ద వరకు ఈయన సినిమాలు చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
ఇక ఈయన చేసిన అత్తారింటికి దారేది( Attharintiki daredi ) , జల్సా,భీమ్లా నాయక్, గబ్బర్ సింగ్,తొలిప్రేమ, బద్రి,తమ్ముడు, గుడుంబా శంకర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన ఖాతాలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి.అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది అనే సంగతి మనకు తెలిసిందే.అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాలు వచ్చాయి.అయితే అత్తారింటికి దారేది, జల్సా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యి పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో నిలిచిపోయాయి.
కానీ అజ్ఞాతవాసి ( Agnyaathavasi movie ) సినిమా మాత్రం అట్టర్ ప్లాఫ్ అయ్యి ఆయన అభిమానుల్ని చాలా నిరాశపరిచింది.కానీ ఈ సినిమా విడుదలయ్యే ముందు చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందని టికెట్ల కోసం గొడవలు పడి మరీ సాధించుకున్నారు.మరీ ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే టికెట్లను వేలంపాటలో పాడి మరీ లక్షలు పెట్టి టికెట్ కొనుగోలు చేశారు.అలా అనంతపురంలో ఉండే పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయితే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మొదటి రోజు బెనిఫిట్ షో చూడడం కోసం ఏకంగా తన ఇంటిని తాకట్టు పెట్టి 20 లక్షలు అప్పు చేసి మరీ ఆ టికెట్ ని కొనుగోలు చేశారట.
ఇక అప్పట్లో ఈ వార్త పెద్ద సెన్సేషన్ సృష్టించింది.ఆ తర్వాత ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ అవ్వడంతో చాలామంది 20 లక్షలు అప్పు చేసి టికెట్ కొన్న అభిమానిని ట్రోల్ చేశారు.
కానీ ఏది ఏమైనప్పటికీ ఎన్ని ప్లాఫ్ లు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానులు మాత్రం తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.