సిగ్నేచర్ లోన్ గురించి మీకు తెలుసా? ఒక్క సంతకం పెడితే చాలట!

కస్టమర్లకు బ్యాంకు వాళ్లు ఇచ్చే లోన్స్( Loans ) గురించి ఓ అవగాహన వుండే వుంటుంది.హోమ్, గోల్డ్, వెహికల్, పర్సనల్ లోన్లు ఇలా చాలా లోన్ల గురించి తెలుసు.

 What Is A Signature Loan That Delivers Money To Your Account With Just One Signa-TeluguStop.com

అయితే మీలో ‘సిగ్నేచర్ లోన్’( Signature Loan ) గురించి ఎంత మందికి తెలుసు? అరరే.అదెప్పుడూ వినలేదని అనుకుంటున్నారా? అవును, సిగ్నేచర్ లోన్ అనేది ఒకటి వుంది.ఇక్కడ మీరు కేవలం ఒక్క సంతకం చేస్తే చాలు.బ్యాంకులు లోన్లు ఇచ్చేస్తాయి.అయితే సిగ్నేచర్ లోన్ తీసుకునేందుకు అందరూ అర్హులు కారని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.కేవలం కొద్ది మందికి మాత్రమే బ్యాంకులు సిగ్నేచర్ లోన్‌ను ఆఫర్ చేస్తాయి.

Telugu Banks, Character Loan, Collateral Loan, Gold, Signature, Personal Loans,

దీనిని ‘క్యారెక్టర్ లోన్’( Character Loan ) అని కూడా పిలుస్తారు.నిజానికి సిగ్నేచర్ లోన్ అనేది ఒక రకమైన వ్యక్తిగత రుణం లాంటిది అని అనుకోవచ్చు.బ్యాంకులు ఎలాంటి పూచీకత్తూ లేకుండా ఈ లోన్లను జారీ చేస్తాయి.అందుకే ఈ లోన్‌కు వడ్డీ రేటు( Interest Rate ) ఎక్కువగా ఉంటుంది.అయితే క్రెడిట్ కార్డు వడ్డీ రేటుతో పోల్చుకుంటే మాత్రం కాస్త తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి.అయితే ఈ లోన్ పొందాలంటే మాత్రం ముందుగా బ్యాంక్ విశ్వాసాన్ని సంపాదించుకోవాలి.

ఈ లోన్ రావాలంటే మీ క్రెడిట్ స్కోరు 580 నుంచి 700 వరకు ఉండాలి.

Telugu Banks, Character Loan, Collateral Loan, Gold, Signature, Personal Loans,

అదేవిధంగా నెలవారీ పేమెంట్లు చేసేందుకు తగినంత ఆదాయం పొందుతూ వుండాలండోయ్.లోన్ తప్పక చెల్లిస్తానని హామీ ఇవ్వవలసి వుంటుంది మరి.అలాగే మీ తరఫున ఓ గ్యారెంటర్ కూడా సంతకం చేయవలసి వుంటుంది.మీరో ఓ సిగ్నేచర్ లోన్ తీసుకుని పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకులు మీకు మరోసారి లోన్ ఇస్తాయి.మీరు ఏ అవసరానికైనా ఈ సిగ్నేచర్ లోన్ అనేది తీసుకోవచ్చు.

ఇంటికి మరమ్మతులు చేయాలనుకున్నా, ఆసుపత్రి బిల్లు చెల్లించాలనుకున్నా లేదా విహార యాత్రల కోసం కూడా ఈ రుణం తీసుకోవచ్చు.ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఇస్తున్నారు కాబట్టి మిగతా లోన్లతో పోల్చుకుంటే దీనికి కాస్త వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది మరి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube