ఒక టీవీ ఛానెల్ చేతిలో ఉంటె ఎలాంటి పని అయినా చేయవచ్చు.వారి వార్తలతో పూలు జల్లవచ్చు, రాళ్ళూ వేయించవచ్చు.
ఎవరినైనా అధికార పీఠం నుంచి దించను వచ్చు.అచ్చం అలాంటి ఒక సంఘటన ఎన్టీఆర్ జీవితాన్ని మాత్రమే కాదు చివరికి చావు వరకు వదలలేదు.
ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకొని రాజీకీయంగా నష్టపోయి కన్ను మూసినా సంఘటనలోనికి ఇప్పుడు నేను వెళ్లడం లేదు కానీ ఒక ఇంటర్వ్యూ ఎలా ఎన్టీఆర్ ని, అయన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసిందో తెలుసుకుందాం.

ఎన్టీఆర్ ని గద్దె దించడానికి చంద్ర బాబు చెప్పిన ఏకైక కారణం లక్ష్మి పార్వతి.ఇది అందరికి తెలిసిన విషయమే.అయితే ఎన్టీఆర్ వర్ధంతి కారణంగా ఆ కరణ జన్ముడిని స్మరించుకుందాం అనే శీర్షిక తో ఒక టీవీ ఛానెల్ ఇప్పుడు హడావిడి చేయడం చూస్తుంటే గతంలో అదే ఛానెల్ ఆయనపై కక్ష గట్టి చంద్ర బాబు కి సపోర్ట్ ఇచ్చి ఎల్లో మీడియా అనే అస్రాన్ని వాడుకొని జనాల్లో అనిష్చితి సృష్టించిందో గుర్తు కు వచ్చింది.
ఎన్టీఆర్ ని గద్దె దించే ముందు ఆయనపై వ్యతిరేఖంగా అనేక వార్తలను ప్రసారం చేసిన సదరు ఛానెల్ కి అప్పట్లో సాయంత్రం ప్రైమ్ టైం లో వార్తలను అందించేది.వాటిని జనాలు కూడా బాగా చూసేవారు.
ఆ టైం లో వార్తలు ఇప్పటి లాగ లైవ్ గా వచ్చేవి కాదు.ఈ రోజు వార్తలు సింగపూర్ నుంచి మరుసటి రోజు ప్రసారం అయ్యేవి.

ఇక చంద్ర బాబు ఎన్టీఆర్ ని దించడానికి ప్రధాన కారణం లక్ష్మి పార్వతి అని కారణం చెప్తే, దానికి ప్రతిగా లక్ష్మి పార్వతి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తనకు కేవలం ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యం అని ఒక ప్రకటన చేసింది.దాంతో చంద్ర బాబు అండ్ కో.కి గట్టి షాక్ తగిలింది.కానీ ఆ వార్తను పక్కన పెట్టి అంతకు ముందు రెండు రోజుల క్రితం లక్ష్మి పార్వతి నాకు ఎన్టీఆర్ ముఖ్యం, ఎమ్మెల్యే లు పూచిక పుల్లలతో సమానం అంటూ మాట్లాడిన మాటలను ప్రసారం చేయడంమే కాకుండా ఆమె రాజకీయ విరమణ ప్రకటన మరో రెండో రోజుల తర్వాత టెలికాస్ట్ చేసారు.
దాంతో లక్ష్మి పార్వతి వాడిన రాజకీయ విరమణ అస్రం పూర్తిగా నిర్వీర్యం అయ్యింది.ఈ లోగా ఎన్టీఆర్ ఎమ్మెల్యే లను సయోధ్యకు పిలిస్తే మేమంతా పిల్లలం అనే ఎదురు దాడి జరిగింది.
దాంతో జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది.