సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా ఈయన పేరు ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు రాజకీయాల పరంగా కూడా మారుమోగుతుంది.
ఇక అల్లు అర్జున్ వ్యవహారంపై ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు.ఇలా గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ విషయమే హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పుడిప్పుడే ఈయన వివాదం అందరూ మర్చిపోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందనతో మరోసారి ఈ విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఇటీవల మీడియా సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ( Allu Arjun, Pawan Kalyan)విషయం గురించి ప్రశ్నలు ఎదురవడంతో మాట్లాడారు.
ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదని రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన పని తాను చేశారని పోలీసులు చట్ట ప్రకారమే తనని అరెస్టు చేశారని తెలిపారు.అయితే ఈ ఘటనలో బన్నీని కూడా ఒంటరి వాడిని చేసారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరుపై మరోసారి పలువురు స్పందిస్తూ అల్లు అర్జున్ ఘటనని హైలెట్ చేస్తున్నారు.
మరోవైపు కేటీఆర్(KTR ) సైతం తన రాజకీయ స్వప్రయోజనాల కోసం తరచూ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.అంతా సర్దుమనుగుతుంది అనుకునే లోపు మరోసారి పవన్ కళ్యాణ్ ఈ ఘటన గురించి స్పందించడంతో తిరిగి అల్లు అర్జున్ వ్యవహారం మొదటికే వచ్చింది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అనంతరం మరోసారి తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నేతలు ఒక్కొక్కరుగా ఈ ఘటన పట్ల స్పందిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్న సంగతి మనకు తెలిసిందే .జనవరి 10వ తేదీకి అల్లు అర్జున్ బెయిల్ గడువు పూర్తి అవుతుంది.పదవ తేదీ తర్వాత ఆయన పరిస్థితి ఏమిటి అనేది అందరిలోనూ ఎంతో ఆత్రుత నెలకొంది.
అల్లు అర్జున్ కు బెయిలు పొడిగిస్తారా లేకపోతే తన బెయిల్ రద్దు చేసే జైలుకు పంపిస్తారా అనే విషయంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి.