గలీజ్ గా మాట్లాడే వాడు.. ఎంతో ఇబ్బందిగా అనిపించింది.. షాకింగ్ నిజం చెప్పిన నోయల్ మాజీ భార్య?

క్యాస్టింగ్ కౌచ్ గత కొంత కాలం నుంచి భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఊపేస్తోంది.ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని రహస్యంగా ఉంచే వారు ఎంతో మంది హీరోయిన్లు.

 Noyal Ex Wife Esther About Casting Couch And Her Divorce , Heroine Esther , Noya-TeluguStop.com

కానీ నేటి రోజుల్లో మాత్రం స్టార్ హీరోయిన్ల దగ్గరి నుంచి చిన్న హీరోయిన్ ల వరకూ కెరియర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాలను అందరికీ చెబుతూ ఇక ఇండస్ట్రీలో పరిస్థితులను వివరిస్తున్నారు.హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు అని చెప్పాలి.

ఇకపోతే ఇటీవలే మరో హీరోయిన్ నోరువిప్పి తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది.తెలుగు రాపర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ నోయల్ మాజీ భార్య ఎస్తర్ నోర్హన్న పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన నటనతో ఆకట్టుకుంది.

సునీల్ నటించిన భీమవరం బుల్లోడు చిత్రంతో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.తర్వాత 1000 అబద్దాలు సినిమాలో నటించింది.ఇక జయ జానకి నాయక సినిమా లో కీలక పాత్రలో నటించింది.ఆ తర్వాత మాత్రం అవకాశాలు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అక్కడ వరుస అవకాశాలు అదుకుంటుంది ఈ హీరోయిన్.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎస్తర్ నోర్హన్న తనకు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎదురైన చేదు అనుభవాలను చెప్పింది.కొత్తలో ఎంతోమంది తీరు మార్చుకోవాలని చెప్పారు.అప్పుడు నాకు అర్థం కాలేదు.కానీ ఆ తర్వాత నన్ను మార్చేందుకు ప్రయత్నించారు.కొత్త సినిమా అవకాశాల కోసం పెద్ద హీరోయిన్ గా ఎదగడానికి డైరెక్టర్ చెప్పినట్లు చేయాలి అంటూ చెప్పారు.ఆ తర్వాత కాస్త ఆలోచిస్తే డైరెక్టర్ కోరిక తీర్చాలని పరోక్షంగా చెప్పారు అన్న విషయం అర్థమైంది.

ఎంతో మంది గలీజ్ గా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టారు.కానీ నాకు ఎవరో చెప్పింది చేసే కర్మ పట్టలేదు.

డాన్స్ నటన అంటే ఇష్టం హీరోయిన్ అవ్వాలనుకున్న.ఇలాంటివి చేస్తే వచ్చే ఛాన్సులు అసలు వద్దు అంటూ తేల్చిచెప్పింది హీరోయిన్ ఎస్తర్ నోర్హన్న.

Noyal Ex Wife Esther About Casting Couch And Her Divorce , Heroine Esther , Noyal Wife, Jaya Janaki Nayaka, Heroine - Telugu Esther, Noyalesther, Noyal

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube