భారత ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు.గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని చత్రసాల్ స్టేడియం వద్ద ఇరు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన ఘర్షణలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌కర్ (23) మృతి చెందాడు.
కాగా ఇతను ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ కొడుకే అని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ గొడవలో సుశీల్ కుమార్ స్వయంగా పాల్గొన్నట్టు వీడియో ఆధారాలు కూడా లభించాయని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలుపుతున్నారు.
ఈ నేపధ్యంలో సుశీల్ కుమార్ అతడి స్నేహితుల పై కేసులు నమోదయ్యాయి.కాగా ఈ ఘటన తర్వాత సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవదంతో గత ఆదివారం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.
ఇక ఈ హత్య విషయంలో కోర్టుకు వెళ్లిన పోలీసులకు సుశీల్‌పై వారెంట్ జారీ చేసేందుకు కోర్టు అనుమతిచ్చిందని, అందువల్ల నిన్న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లుగా వెల్లడించారు.ఇకపోతే ఈ హత్య కేసులో సుశీల్‌తోపాటు మరో ఆరుగురిపై కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.