నటుడు అల్లుఅర్జున్ తెలుగు సినీ జనాలకు పరిచయం అక్కరలేని పేరు.మెగా నట వారసుడిగా, అల్లు రామలింగయ్య మనవడిగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అల్లుఅర్జున్ దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తన మొట్ట మొదటి సినిమా గంగోత్రితో బ్లాక్ బస్టర్ కొట్టి నట వారసుడిగా తన సత్తాను చాటుకున్నాడనే చెప్పవచ్చు.
ఇక ఆ తరువాత ఆర్య, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరంచుకున్నాడు.నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా డ్యాన్స్ లలో, ఫైట్స్ లో తన కంటూ ఒక మార్క్ సృష్టించుకున్న అల్లుఅర్జున్ అనతి కాలంలోనే సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిపోయాడు.
తెలుగు లోనే కాక తమిళం, మలయాళంలో కూడా బన్నీకి సూపర్ క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు.అయితే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే పుష్ప సినిమాకు 25 కోట్ల రూపాయల పారితోషికం, లాభాల్లో వాటాను పారితోషికంగా అంగీకారించాడట.అయితే పుష్పను మొదట్లో ఒక్క భాగంలో తీస్తామని చెప్పినా, ఆ తరువాత ఇప్పుడు రెండు భాగాల్లో సినిమా తీస్తామని దర్శకుడు చెప్పడంతో ఇప్పుడు ఒక్క రెండో భాగానికి.రూ.50కోట్ల రూపాయల పారితోషికం తీసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.ఏది ఏమైనా పారితోషికం విషయంలో బన్నీ తగ్గేదే లే అంటున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.