ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి ఊహించని షాక్ తగిలింది.2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం లో జరిగిన ఘటన పై తాజాగా ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇలా జరగడానికి కారణం ఏంటంటే.2016 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై జరిగిన దాడి కేసులో కోర్టుకు అసద్ హాజరు కాకపోవడంతో ఈ వారెంట్ జారీ చేసిందట.
కాగా ఎన్ని సార్లు కోర్టుకు హాజరు కావాలని అసదుద్దీన్ ఓవైసీకి సమాచారం అందించిన, కోర్టు మాటను పట్టించుకోకుండా విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇకపోతే ఎన్నికల సమయంలో షబ్బీర్ అలీ ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు.
అనంతరం ఆయనపై దాడికి దిగారు.ఈ ఘటనకు సంబంధించి కేసు మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో నమోదైంది.
ఈ సమయంలో కొన్ని ఆధారాల ప్రకారం పోలీసులు అసదుద్దీన్ ఒవైసీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ, కేసు నమోదు చేశారట.అయితే, ఈ దాడిలో తన పాత్ర లేదని గతంలో ఒక ట్వీట్ ద్వారా అసదుద్దీన్ వెల్లడించారు.
ఈ దాడిలో తన ప్రమేయం లేనప్పుడు అదే విషయాన్ని కోర్టులో చెబితే సరిపోతుందని, ఇలా కోర్టుకు హాజరు కాకపోవడానికి అర్ధం ఏంటని అనుకుంటున్నారట కొందరు.