డ్రగ్స్ మాఫియా పై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ధ్వజమెత్తారు.
తాజాగా సినీ రంగ ప్రముఖులు పై విచారణ పేరుతో చేస్తున్న హడావిడి రక్తి కట్టిస్తుంది అని ఎద్దేవా చేశారు.ఈ కేసులో సమగ్ర విచారణ జరిపించాలని, మాఫియాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న తయారీదారులను పట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డ్రగ్స్ తయారు చేసే వారు లేకపోతే సరఫరా చేసేవారు, వినియోగించేవారే ఉండరని విషయాన్ని కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు.దేశ సరిహద్దుల్లో టెర్రరిస్టులు ఆగడాలను అరికట్టడం, డ్రగ్స్ మాఫియా ను అణచి వేయడం, ఎన్నికల్లో ఏరులై పారుతున్న నల్లధనాన్ని నిలువవరించడానికే నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రధాన మోడీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రధాని ప్రసంగములు నొక్కి చెప్పిన డ్రగ్స్ మాఫియా అణిచిత లక్ష్యంగా చేసినవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు అంటూ నిలదీశారు.గతంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రగ్స్ దందా పై సిట్ దర్యాప్తునకు ఆదేశించిన రిపోర్ట్ ను బుట్ట దాఖలు చేసిందని విమర్శించారు.
తాజాగా ఈడీ చేపట్టిన విచారణ తంతుగానే మారిందని తెలిపారు.కళాకారులు ఏడిపించడానిగానే ఉందని అసలు మాఫియా పట్టుకునేందుకు లేదని వ్యాఖ్యానించారు.ఈ వ్యవహారంలో విచారణ సెన్సేషనల్ పద్ధతిలో కాకుండా సెన్సిబుల్ పద్ధతిలో జరగాల్సి ఉందని స్పష్టం చేశారు.ఇప్పటికైనా డ్రగ్స్ తయారీదారుల పై గురిపెట్టాలని దర్యాప్తు సంస్థలకు సూచించారు.