చిత్రకథ :
రాజవంశీయులైన భూపతి రాజు, భూపతి నగరంలో చాలా పెద్ద మనిషి.ఆయన కనుసన్నలల్లోనే అన్ని జరుగుతుంటాయి.
భూపతి రాజుకి ఒక్కగానొక్క కూతురు శాంతి (శ్రేయా శర్మ).ఇక అదే ఊరిలో పేద కుటుంబంలో పుట్టిన శామ్యుల్ (రోహ్సన్) చాలా తెలివైన వాడు.
శామ్యుల్, శాంతిలు ఒకరినొకరు ఇష్టపడతారు.అయితే దాన్ని సహించలేని భూపతి రాజు శామ్యుల్ ను బెదిరించే ప్రయత్నం చేస్తాడు.
ఇక పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్లిన శామ్యుల్ తండ్రితో తనంత గొప్పవాడిగా తనకంటే ఎక్కువ సంపదతో వస్తే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు.ఇక ఆ పందెం గెలవడానికి శామ్యుల్ ఏం చేశాడు.? కథలో నాగార్జున ఎందుకు వచ్చాడు.? చివరకు పందెంలో గెలిచాడా.? అన్నది అసలు కథ.
నటీనటుల ప్రతిభ :
హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్న శ్రీకాంత్ తన తనయుడు రోషన్ ను ఈ నిర్మలా కాన్వెంట్ తో పరిచయం చేశాడు.శామ్యుల్ పాత్రలో రోషన్ మొదటి సినిమా అయినా పాత్రకు తగ్గ అభినయం పండించాడు.మొదటి సినిమానే అయినా పర్వాలేదు అనిపించాడు.రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్భుతంగా ఉంది.ఇక హీరోయిన్ గా చేసిన శ్రీయా శర్మ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి శాంతి పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది.
ముఖ్యంగా కింగ్ నాగార్జున ఈ సినిమా కోసం ఎం.ఈ.కె సెట్ తో మరోసారి అలరించారు.సెకండ్ హాఫ్ మొత్తం నాగార్జున ప్రెజెన్స్ తో సినిమా జోష్ ఫుల్ గా నడుస్తుంది.
మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికవర్గం పనితీరు :
నిర్మాలా కాన్వెంట్ అని సినిమా మొదలైన నాటి నుండి సినిమా కోసం నాగార్జున మొత్తం భాధ్యతను మీద వేసుకున్నారు.ఇక దర్శకుడు నాగ కోటేశ్వర రావు డైరక్షన్ పరంగా ఓకే అనేలా ఉంది.ఇక రోషన్ సాలూరి అందించిన మ్యూజిక్ కాస్త రిఫ్రెషింగ్ గా ఉంది.ఫ్రెష్ లవ్ కు సింబాలిక్ గా రోషన్ ఇచ్చిన మ్యూజిక్ కాస్త కొత్తగా ఉంటుంది.మాట్రిక్స్ మూవిస్, అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
విశ్లేషణ :
నిర్మాలా కాన్వెంట్.శ్రీకాంత్ తనయుడిని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిన ఈ సినిమాలో కథ అంతగా వర్క్ అవలేదు.
అయితే ఉన్నంత వరకు కాస్త బెటర్ గానే డీల్ చేశాడు డైరక్టర్.తన ప్రేమని దక్కించుకునేందుకు రాజుతో చాలెంజ్ చేసి హైదరాబాద్ వెళ్లి అక్కడ కింగ్ నాగార్జునను కలవడం అంతా సినిమాటిక్ గానే ఉంటుంది.
ఇక సెకండ్ హాఫ్ లో ఎం.ఈ.కె లానే చాంపియన్ ఆఫ్ చాంపియన్ కూడా స్లం డాగ్ మిలినియర్ సినిమాను గుర్తు చేస్తుంది.
మీలో ఎవరు కోటిశ్వరుడు అని పెడితే మళ్లీ యాజిటీజ్ అదే దించినట్టు ఉంటుంది అని తన ప్రతిభకు తానే చాలెంజ్ చేస్తున్నట్టు ఎం.ఈ.కె లో హయ్యెస్ట్ ఎమౌంట్ గెలిచిన అందరి చేత తయారు చేసిన ప్రశ్నలతో శామ్యుల్ చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ గా 2 కోట్లు గెలుస్తాడు.అయితే ఈ గేం షోలో నాగ్ అడిగిన ప్రశ్నలు అంత టఫ్ గా ఉండవని అనిపిస్తుంది.
ఫైనల్ గా శ్రీకాంత్ తనయుడి మొదటి ప్రయత్నం నిర్మలా కాన్వెంట్ తన వరకు బెస్ట్ అనిపించుకున్నా సినిమా మాత్రం అంతగా ఇంప్రెస్ చేయలేదని అనాలి.
అయితే టైం పాస్ కోసం ఓసారి మాత్రం భేషుగ్గా చూసేయొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
నాగార్జున
రోషన్, శ్రీయా శర్మ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
నేరేషన్
డైరక్షన్
బాటం లైన్ : నిర్మాలా కాన్వెంట్ ఓసారి చూసేయొచ్చు.!