న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఓటు హక్కు వయసును తగ్గిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించబోతోంది.
ఓటింగ్ వయస్సును 18 నుండి 16కి తగ్గించడాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఆ దేశ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ పార్లమెంటులో ఒక చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.
సుప్రీంకోర్టు కీలక తీర్పు తర్వాత 16 ఏళ్ల యువకులకు ఓటు హక్కు కల్పించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.న్యూజిలాండ్ ఓ కీలక చట్టాన్ని రూపొందించాలని భావిస్తుంది.
కేవలం 16 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కును కల్పించాలని యత్నిస్తుంది.ఓటరు వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించడాన్ని పరిశీలిస్తోంది.
ఈ మేరకు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ పార్లమెంటులో ఒక చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఆధారంగా 16 ఏళ్ల యువకులకు ఓటు హక్కు కల్పించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
18 ఏళ్లు దాటిన వాళ్లకే ఓటు హక్కు కల్పించడమంటే.యువత యొక్క మావన హక్కుల్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆ దేశ సుప్రీంకోర్టు ఓ కేసులో సంచలన తీర్పునిచ్చింది.
ప్రధాని జసిండా ఆర్డెర్న్ వ్యక్తిగతంగా ఈ మార్పుకు మద్దతు ఇచ్చారు.ఓటింగ్ వయస్సు తగ్గించడానికి తాను వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నానని తెలిపారు జసిందా ఆర్డెర్న్.కానీ, ఈ మేరకు చట్టాన్ని రూపొందించడానికి తన ప్రభుత్వానికి సరైన మెజార్టీ లేదని, ఈ తరహా ఎన్నికల చట్టాన్ని మార్చాలంటే 75 శాతం పార్లమెంటరీ మద్దతు అవసరమని తెలిపారు జసిందా ఆర్డెర్న్.
వాతావరణ సంక్షోభం వంటి సమస్యలపై యువత ఓటు వేయగలగాలని, లేకపోతే.వారికి , వారి భవిష్యత్తును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని న్యూజిలాండ్ కోర్టు పేర్కోంది.బ్రెజిల్, ఆస్ట్రియా మరియు క్యూబా వంటి కొన్ని దేశాలు 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి ఓటు వేసే హక్కుల్ని కల్పిస్తోంది.
అయితే ఓటు హక్కు వయసును కుదించేందుకు ప్రధాని జెసిండా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం పాస్ చేసే బిల్లుకు పార్లమెంట్‌లోని 75 శాతం మంది ఎంపీలు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది.
వాతావరణ మార్పులు లాంటి అంశాలపై యువకులు ఓటు వేయాల్సి ఉంటుందని న్యూజిలాండ్ కోర్టు పేర్కొన్నది.బ్రెజిల్, ఆస్ట్రియా, క్యూబా దేశాలు మాత్రం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారికి ఓటు వేసే హక్కుల్ని కల్పిస్తోంది.
పొగ త్రాగటం హానికరం.అయినా పొగరాయుళ్లు మానరు.గుప్పు గుప్పుమని పొగ వదులు దమ్ముకొట్టేస్తుంటారు.లంగ్స్ పాడైపోయినా సిగిరెట్లు కాల్చటం మాత్రం మానరు.ఇదిలా ఉంటే పొగరాయుళ్లకు చెక్ పెట్టాలని గతంలో న్యూజిలాండ్ ప్రభుత్వం వినూత్న ప్రతిపాదన తెచ్చింది.ఒకేసారి నిషేధించకుండా వినూత్న యోచన చేసింది ప్రభుత్వం.
అదేమిటంటే.పొగతాగేవారి కనీస అర్హతను పెంచే ప్రతిపాదన చేసింది.
అలా ఒక్కో సంవత్సరం ఆ కనీస అర్హత వయస్సును పెంచుతామని ప్రభుత్వం వెల్లడించింది.ఈ ప్రతిపాదనను విశ్లేషించి చూస్తే అలా పెరుగు పెరుగుతు చివరికి.
వారు జీవితంలో ఇక పొగతాగే అవకాశం లేని ఓ వినూత్న ప్రతిపాదన తెచ్చింది న్యూజిలాండ్ ప్రభుత్వం.ఏటా ధూమపానం చేసేందుకు యువతకు ఉండాల్సిన కనీస వయసును పొడగించాలి అని నిశ్చయించుకుంది.
న్యూజిలాండ్ 18 ఏళ్లలోపు వారికి పొగాకు అమ్మకాలను నిషేధించింది.ఈక్రమంలో ఈ వయస్సును మరింతగా తగ్గించనుంది.