ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్‌లో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఇందులో భాగంగా హైవేను ముట్టడించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు.దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
గ్రామస్థులకు, రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.ఈ నేపథ్యంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.
దీంతో ఉద్రిక్తత నెలకొంది.అనంతరం నిరసన చేస్తున్న గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టగా.
గ్రామస్థులు ఎదురుదాడికి దిగారు.ఈ దాడిలో ముగ్గురు పోలీసులకు గాయాలు కాగా.
వాహనాలు ధ్వంసంఅయ్యాయని సమాచారం.