చలికాలంలో పైనాపిల్ ఎక్కువగా దొరికే పండు.ఇది రుచిలో తియగా పుల్లగా ఉంటుంది.
అయితే తగిన మోతాదులో తినడం వల్ల పైనాపిల్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అయినప్పటికీ కొంతమంది ఈ పండును తినడానికి ఇష్టపడరు.
కానీ ఇందులో ఉండే ప్రయోజనాలు తెలుసుకుంటే అలాంటి వాళ్ళు కూడా వీటిని తినడం మొదలుపెడతారు.
ఎందుకంటే పైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఇతర సమ్మేళనాలు ఉన్నాయి.
వీటన్నిటితో శరీరానికి కావాల్సిన న్యూట్రియన్స్ అందడం వల్ల అవి శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.అలాగే ఇది క్యాన్సర్ బారిన పడకుండా కూడా కాపాడుతాయి.ఎందుకంటే పైనాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తుంది.
అలాగే శరీర ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.
అంతేకాకుండా ఇందులో బ్రొమెలిన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది.ఇది మనం తినే ఆహారంలోని ప్రోటీన్లను తొందరగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి.
అందుకే నాన్వెజ్ తిన్న తర్వాత పైనాపిల్ పండు తింటే తొందరగా జీర్ణం అవుతుందని చాలామంది తింటూ ఉంటారు.
అంతేకాకుండా కడుపుబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలు కూడా పైనాపిల్ పండును తినడం వల్ల తొలగిపోతాయి.అది మాత్రమే కాకుండా ఇందులో ఉండే అధిక ఫైబర్ వల్ల బరువు తగ్గవచ్చు.అలాగే తెల్ల రక్త కణాలు తక్కువగా ఉన్న వాళ్లు కూడా పైనాపిల్ పండును తినడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలు ఎక్కువగా పెరుగుతాయి.
ఎందుకంటే ఇందులో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ కు నియంత్రిస్తుంది.అలాగే వీటిని తరచూ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.అయితే గర్భం దాల్చిన స్త్రీలు మాత్రం పైనాపిల్ కి దూరంగా ఉండటమే మంచిది.గర్భిణీలు పైనాపిల్ ని తింటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.