Harkirat Singh Brampton : కెనడా : బ్రాంప్టన్ డిప్యూటీ మేయర్‌గా భారతీయుడు... తొలి సిక్కు వ్యక్తిగా రికార్డు..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.రాజకీయాల్లోనూ రాణిస్తూ పలు కీలక పదవులను సొంతం చేసుకుంటున్నారు.

 Harkirat Singh, First Turbaned Sikh Appointed Deputy Mayor Of Canada's Brampton-TeluguStop.com

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలలో భారతీయుల ప్రాబల్యం ఎక్కువగా వున్న సంగతి తెలిసిందే.అక్కడి ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపొటములను మనవాళ్లే నిర్ణయిస్తున్నారు.

తాజాగా కెనడాలోని బ్రాంప్టన్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయుడు, అందులోనూ సిక్కు వ్యక్తి సంచలనం సృష్టించాడు.బ్రాంప్టన్ నగర డిప్యూటీ మేయర్‌గా హర్‌కీరత్ సింగ్ నియమితులయ్యారు.

అంతేకాదు .ఈ పదవిని అధిష్టించనున్న తొలి సిక్కు సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు.

2022 నుంచి 2026 వరకునాలుగేళ్ల పాటు హర్‌కీరత్ సింగ్ ఈ పదవిలో వుంటారు.ఆయన గతంలో 2018-22 వరకు బ్రాంప్టన్ సిటీలోని 9, 10 వార్డ్‌లకు కౌన్సిలర్‌గా పనిచేశారు.

కౌన్సిలర్ కావడానికి ముందు పీల్ డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్‌లో స్కూల్ ట్రస్టీగా నాలుగేళ్ల పాటు విధులు నిర్వర్తించారు.ట్రస్టీగా, ఆడిట్ కమిటీ, ఇన్‌స్ట్రక్షన్ ప్రోగ్రామ్, కరికులం కమిటీ, ఫిజికల్ బిల్డింగ్ అండ్ ప్లానింగ్ కమిటీల్లో కీలకపాత్ర పోషించారు.

అంటారియో పబ్లిక్ స్కూల్ బోర్డ్ అసోసియేషన్ (ఓపీఎస్‌బీఏ)లో హర్‌కీరత్ ప్రాంతీయ ప్రధినిధిగా వ్యవహరిస్తున్నారు.వీటితో పాటు లాంబ్డన్ కాలేజీలో, హంబర్ కాలేజీలలో ఆయన ప్రొఫెసర్‌గా సేవలందించారు.

Telugu Brampton, Canada, Deputy Mayor, Harkirat Singh, Opsba, Sikh-Telugu NRI

కమ్యూనిటీ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు గాను స్థానిక పాఠశాలల్లో మెంటార్‌షిప్ వర్క్‌షాప్‌లు , కెరీర్ ఫెయిర్‌లను నిర్వహిస్తున్నాడు.ఈ సేవలకు గాను ఆయన 2016లో బ్రాంప్టన్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్ నుంచి మెంటార్‌షిప్ అవార్డ్‌కు నామినేట్ అయ్యారు.టొరంటో యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందిన హర్‌కీరత్ సింగ్ … లండన్ మెట్రోపాలిటిన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో ఎంఎస్సీ, షులిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చదివారు.తనకు డిప్యూటీ మేయర్ పదవి దక్కడంపై హర్‌కీరత్ సింగ్ స్పందించారు.

నగర మేయర్ బ్రౌన్, కౌన్సిలర్‌లకు మద్ధతుగా వుంటానని స్పష్టం చేశారు.డిప్యూటీ మేయర్ సాధారణంగా సిటీ కౌన్సిల్, ఇతర కమిటీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

మేయర్ గైర్హాజరైనప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు మేయర్ తరపున పలు బాధ్యతలు స్వీకరిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube