టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి కలిసి నటించిన చిత్రం డీజే టిల్లు( DJ Tillu ). విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన డిజే టిల్లు సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ చిత్రానికి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే.
సిద్ధు హీరోగా మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు.ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే మొదట్లో ఈ సినిమాలో అందరూ నేహా శెట్టి( Neha Shetty ) హీరోయిన్ గా నటిస్తుంది అని అనుకున్నారు.
కానీ అనుపమ( Anupama Parameswaran ) నటిస్తుండడంతో దీని వెనక అనేక కారణాలు అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.అయితే టిల్లు స్క్వేర్ సినిమాలో తాను నటించకపోవడం పట్ల కారణాలను వెల్లడించింది నేహా శెట్టి.ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ.
రాధికతో నాకు మంచి గుర్తింపు లభించింది.టిల్లు స్క్వేర్ సినిమాలో నేను నటించకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు.
సీక్వెల్( DJ Tillu Sequel ) విషయంలో మూవీ మేకర్స్ మొదటి నుంచి పూర్తి స్పష్టతతో ఉన్నారు.డీజే టిల్లు మూవీకు కొనసాగింపుగా ఇది తెరకెక్కడం లేదు.
ఆ కథకు ఇప్పుడు రానున్న కథకు ఎటువంటి సంబంధం లేదు.అందుకే నేను ఈ సినిమాలో భాగం కాలేదు.
టిల్లు స్క్వేర్( Tillu Square ) లో నేను భాగం కాకపోవడంపై కొంత మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మీరు ఎందుకు నటించడం లేదు? ఆఫీస్‌కు వెళ్లి ఒక్కసారి మాట్లాడండి, టిల్లును కలిసి ప్రశ్నించండి అంటూ మెస్సేజ్‌లు కూడా పంపించారు అని ఆమె చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.నేహా శెట్టి చేసిన వాఖ్యలు అనేక రకాల వార్తలకు రూమర్స్ కి చెక్ పెట్టినట్టు అయింది.
ఇంకా డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా విడుదల అవుతుంది అని వస్తున్న వార్తలకు నేహాశెట్టి పులిస్టాప్ పెట్టినట్టు అయింది.ఏ విధంగా ఈ సినిమాలో తాను నటించకపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు అని ఆమె తెలిపింది.