సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నయనతార ( Nayanatara ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా తన ఇద్దరి కవల పిల్లలతో కూడా ఎంతో సంతోషంగా గడుపుతూ మరోవైపు మాతృత్వాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంది.నయనతార గత 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే గత ఏడాది ఈమె డైరెక్టర్ విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) ను వివాహం చేసుకున్నారు.ఇక ఈ జంట వివాహమైనటువంటి నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిపోయారు.
సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.
కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారినటువంటి ఈ జంట తమ పిల్లలకు ఉయర్ రుద్రో నీల్, ఉలగ్ దైవిక్ ( Uar Rudro Neal, Ulag Daivik )అనే పేర్లు పెట్టారు.మొన్నటి వరకు ఆ పిల్లల పేస్ ని అభిమానులకు చూపించకుండా జాగ్రత్తపడిన నయన్ దంపతులు ఇటీవల వారి పుట్టినరోజు సందర్భంగా వారి పిల్లల ఫోటోలను రివిల్ చేసిన సంగతి తెలిసిందే.ఇలా తరచూ తన పిల్లల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నయన తార విగ్నేష్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా నయనతార ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
నయనతార షేర్ చేసిన ఈ వీడియోలో.ఆడుకొని కష్టపడిన తన కొడుకు చిన్న పాదాలకు సేవ చేస్తూ కనిపిస్తుంది.బుడ్డోడి బుల్లి పాదాలను నయన్ ఒత్తుతుంటే.
అమ్మ ఒడిలో హాయిగా రిలాక్స్ అవుతూ నయన్ వారసుడు ఉయర్ రుద్రో నీల్ కనిపిస్తున్నాడు.ఇక ఈ వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చిల్లింగ్ ఉయర్ ( Uyir ) అంటూ క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఎంతో మందిని ఆకట్టుకుంది.
కెరియర్ పరంగా నయనతార ఎంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఒక కొడుకుకి తల్లే కదా అంటూ ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.ఇలా నయనతార తన కొడుకులకు సేవ చేస్తూ పూర్తిగా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పాలి.