రాయలసీమలో అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీ నేతల మద్య సవాళ్ళు ప్రతిసవాళ్లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.నువ్వు ఒక్కడుగు ముందుకొస్తే నేను పది అడుగులు ముందుకేస్తా అన్న రీతిలో సవాళ్ళు కోణసాగుతుంటాయి.
ఇక తాజాగా మరోసారి రాయలసీమ( Rayalaseema ) పోలిటికల్ హిట్ భగ్గుమంటోంది.తాడిపత్రి( Tadipatri ) కేంద్రంగా అలుముకున్న ఈ రాజకీయ రగడకు నారా లోకేశ్( Nara Lokesh ) నిప్పంటించారు.
లోకేశ్ యువగళం పాదయాత్ర తాడిపత్రిలో సాగుతున్న వేళ.అక్కడి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డిపై( Mla Kethireddy Peddireddy ) నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు.పెద్దరెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఎన్నో భూ కబ్జాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.
దీంతో లోకేశ్ ఆరోపణలపై స్పందించిన కేతిరెడ్డి పెద్దరెడ్డి. తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని, అలా చేస్తే లోకేశ్ కు తల వంచి క్షమాపనలు కోరతానని అలా నిరూపించలేని పక్షంలో తాడిపత్రిలో పాదయాత్ర ఆపేయాలని పెద్దరెడ్డి సవాల్ విసిరారు.దీంతో పెద్దరెడ్డి సవాల్ కు తాడిపత్రి స్థానిక టీడీపీ నేత జేసి ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.
నువ్వు చేసిన అక్రమాలకు ప్రజలే పంచ ఊడదీసి కొడతారని లోకేశ్ పాదయాత్రను అడ్డుకునే దమ్ము నీకుందా ? అడ్డుకొని చూడు ఏం జరుగుతుందో చూపిస్తాం అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఒక ఒకరిపై ఒకరు చేసుకుంటున్న సవాళ్ళు ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.అసలు భూ కబ్జాలకు పాల్పడింది జేసి బ్రదర్స్ అని పెద్దిరెడ్డి ఆరోపిస్తుంటే.దమ్ముంటే నిరూపించు అని జేసి ప్రభాకర్ రెడ్డి కౌంటర్ వేస్తున్నారు.
తాడిపత్రి కేంద్రంగా ఇద్దరు రెడ్ల మద్య రాజకున్న రాజకీయ రగడ ఎంతవరకు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.ఇక లోకేశ్ పాదయాత్రలో భాగంగా వైసీపీ స్థానిక ఎమ్మెల్యేలను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.
ఆ మద్య దర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కూడ భూ కబ్జాల విషయమై తీవ్ర ఆరోపణలు చేశారు లోకేశ్.దానికి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
మొత్తానికి రాయలసీమలో భూకబ్జాల విషయంలో లోకేశ్ పెడుతున్న మంట స్థానిక నేతలను ఉలికిపాటుకు గురిచేస్తోంది.