మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ ను విచారించనుంది న్యాయస్థానం.
హత్య కేసులో ఏ4 దస్తగిరిని అఫ్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఇదే అంశంపై ఎంవీ కృష్ణారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది హైకోర్టు.కాగా దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగానే అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.
దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగగా తమను నేరంలోకి నెట్టడం సమంజసం కాదని వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
హత్యలో కీలక పాత్రదారుడు దస్తగిరికి బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.దస్తగిరి బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.







