పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) చేస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్‘ ( Adipurush ) ఒకటి.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.
ఎందుకంటే ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది.ఫ్యాన్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా నుండి సరైన అప్డేట్స్ ను టైం టు టైం అందించడంలో మేకర్స్ విఫలం అవుతున్నారు.
అప్పుడే ఏప్రిల్ నెల కూడా స్టార్ట్ అయ్యి గడిచిపోతూనే ఉంది.కానీ ప్రభాస్ మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ ఇంకా చురుకుగా చేయడం లేదు.జూన్ లో రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియన్ మూవీకి కావాల్సిన ప్రమోషన్స్ ను ఈ సినిమా మేకర్స్ చేయలేక పోతున్నారు.ఇటీవలే రామనవమికి ఒక పోస్టర్, హనుమాన్ జయంతికి ఒక పోస్టర్ రిలీజ్ చేసి చేతులు దులుపు కున్నారు మేకర్స్.

అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుంది.ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ మీద మంచి అంచనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ సినిమా టీజర్ లో ”జై శ్రీరామ్” ట్యూన్ అందరికి బాగా కనెక్ట్ అయ్యింది.
మరి ఈ ఫుల్ సాంగ్ అయితే మేకర్స్ ఫస్ట్ సింగిల్ ( Adipurush First Single ) గా రిలీజ్ చేయబోతున్నట్టు సినీ వర్గాల నుండి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమాకు బాలీవుడ్ ఫేమస్ సంగీత దర్శకులు అజయ్, అతుల్ లు సంగీతం అందిస్తున్నారు.కాగా రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ( Om Raut ) తెరకెక్కించగా టి సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ( Kriti Sanon ) సీతగా నటించింది.
అలాగే సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.







