మహేష్ బాబు(Mahesh Babu) తాజాగా గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభమైందో తెలియదు కానీ మొదటి నుంచి కూడా ఈ సినిమాకు అవంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి.
సినిమా ప్రారంభమైన తర్వాత హీరోయిన్లు మారిపోవడం మహేష్ బాబు ఇంట్లో విషాదాలు జరగడంతో షూటింగ్ ఆలస్యం కావడం జరుగుతూనే వస్తుంది.అంతేకాకుండా ఈ సినిమా పట్ల ఎన్నో నెగటివ్ కామెంట్స్ కూడా రావడంతో నాగ వంశీ (Nagavamshi) ఎప్పటికప్పుడు సినిమా పట్ల వస్తున్నటువంటి నెగటివ్ కామెంట్లను తిప్పికొడుతూ వచ్చారు.
ఈ విధంగా ఈ సినిమా విషయంలో నాగ వంశీ ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా విడుదల అయ్యి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచిగా వసూలు రాబడుతుంది.ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి నాగవంశీ ఈ విషయం గురించి మాట్లాడితే చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా నెగిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్(Guntur Kaaram Collections) పరంగా మాత్రం చాలా మంచిగా వచ్చాయి నిర్మాతలకు ఏమాత్రం నష్టం లేదని తెలిపారు.
ఇకపోతే గుంటూరు కారం సినిమా విషయంలో మేము చేసినటువంటి తప్పు ఏంటి అనే విషయానికి వస్తే.బెనిఫిట్ షో లు( Benefit Shows ) వేయడం.అర్ధరాత్రి ఒంటిగంటకు వచ్చే ఫ్యాన్స్ సినిమాలో ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ కోరుకున్నారు మాస్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉండడంతో కాస్త బెడిసి కొట్టింది.అంతే ఒకవేళ మేము అర్ధరాత్రి నుంచి పాజిటివ్ టాక్ వచ్చేది అంటూ ఈ సందర్భంగా నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.