కుబేరుల జాబితాలో ముందు ఉండే ముకేశ్ అంబానీ ఇంట్లో సీఆర్ఫీఫ్ జవాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.వీఐపీ కోటాలో ముకేశ్ అంబానీ కి ‘జెడ్+’ కేటగిరి,ఆయన భార్య నీతా అంబానీ కి ‘వై’.
కేటగిరి ప్రకారం సెక్యూరిటీ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలో దక్షిణ ముంబై లోని వారి విలాసవంతమైన ‘అంటాలియా’ కు సెక్యూరిటీ విధులు నిర్వహించడం కోసం బోతారా డి రాంభాయ్ ని నియమితులయ్యారు.
అయితే అతడు అనూహ్యంగా తన తుపాకీ టోన్ తనను తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.
గుజరాత్ కు చెందిన రాం భాయ్ అసలు నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా,లేదంటే ప్రమాదవశాత్తు గన్ పెళ్లి మృతి చెందాడా అన్న కోణం లో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.2014 లో సీఆర్ఫీఎఫ్ లో చేరిన రాంభాయ్ అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో,లేదా ఆయన మృతి వెనుక మరేదైనా కోణం ఉందా అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.