ఏపీ సీఎం,వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియా పత్రిక సాక్షి పై మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తుంది.విశాఖ 12 వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఏకంగా రూ.75 కోట్లకు దావా వేసినట్లు సమాచారం.2019 అక్టోబర్ 22 న సాక్షి పత్రిక లో మాజీ మంత్రి లోకేష్ పై ఒక కధనాన్ని ప్రచురించింది.అయితే ఆ కధనంలో తనపై తప్పుడు ప్రచారం చేశారని లోకేష్ ఒరిజినల్ సూట్ 6/2020 నెంబర్ తో వాజ్యం దాఖలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఆ కధనం ఉందని, సాక్షి పత్రిక నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ పిటీషన్ దాఖలు చేశారు.‘చినబాబు చిరుతిండి 25 లక్షలండి’ అనే పేరుతో గతఏడాది సాక్షి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించిందని.
దీనితో లోకేష్ గతంలోనే ఆ కధనం పై స్పందించారు కూడా.సాక్ష్యాలతో సహా సాక్షి చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి అంటూ పలు సార్లు ప్రశ్నించారు కూడా.
అయితే ఆ కధనం తనపై తప్పుడు ప్రచారం చేసేలా ఉందని ఆరోపిస్తూ తాజాగా పరువు నష్టం దావా వేశారు.లోకేష్ తన ట్వీట్లో అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక సాక్షి,.
తోచక, మతి, నీతీలేని కథనాలతో నా మీద ఇదిగో ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టింది అని ఈ కధనం నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఉంది అంటూ ఆయన పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు తెలిపారు.