బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైనటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఒకరు.సీతారామం సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె తన అందం అభినయం నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని పక్కింటి అమ్మాయి అనే భావన కలిగించారు.దీంతో ఈమెకు తెలుగులో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
సీతారామం సినిమా ( Sitaramam Movie ) ఎంతో మంచి విజయం కావడంతో ఈమెకు తెలుగులో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈమె తెలుగులో నాని హీరోగా నటించిన హాయ్ నాన్న ( Hi Nanna ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమాతో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )తో కలిసి మరో సినిమాలో కూడా నటించారు.కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా శివ కార్తికేయన్ తో కలిసి ఒక సినిమాకు కమిట్ అయ్యారు.
ప్రస్తుతం సౌత్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా మృణాల్ ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ… ఓకే భాషలో సినిమాలు చేస్తూ ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోవాలనే కోరిక నాకు ఏమాత్రం లేదని తెలియజేశారు.తనకు ప్రతి ఒక్క భాషలోనూ అన్ని రకాల పాత్రలలోనూ నటించాలనే కోరిక ఉంది.ముఖ్యంగా మూస ధోరణిలో ఉన్నటువంటి పాత్రలలో నటించడానికి తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని అలాంటి పాత్రలలో తాను నటించాలని కోరుకోవడం లేదు అంటూ ఈమె తెలియజేశారు.అందుకే వివిధ భాషలలో విభిన్న పాత్రలలో( Different Roles ) నటించాలని కోరుకుంటున్నానని నా నుంచి ప్రేక్షకులు కూడా ఇదే ఆశిస్తున్నారు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.