కిడ్నీలో రాళ్ళు కదిలాయంటూ భారతీయుడు కేసు...నష్టపరిహారం ఎంతో తెలుసా...!!!

భారత సంతతికి చెందిన ఓ ఎన్నారై బ్రిటన్ లో లాయర్ గా స్థిరపడ్డాడు.స్థానికంగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు కూడా.

 Moving Stones In Kidney Indian On Supermarket-TeluguStop.com

అయితే ఇప్పుడు అతడు ఓ ప్రముఖ సూపర్ మార్కెట్ పై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సంచలనం సృష్టిస్తోంది.ఆ నోటా ఈ నోటా వెళ్ళిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ ఏమిటా కేసు.?? అంతగా సంచలనం సృష్టించడానికి కారణం ఏముంటుంది అనే వివరాలలోకి వెళ్తే.

లాలూ హనుమాన్ అనే భారత సంతతికి చెందిన ఎన్నారై ,ఓ రోజు తనకి దగ్గరలో ఉన్న ఓ ప్రముఖ సూపర్ మార్కెట్ టెస్కో కి వెళ్లి ఓ చాక్లెట్ బార్ కొనుగులు చేశాడు.స్థానికంగా జరుగుతున్న ఓ మ్యూజికల్ షో కి వెళ్తున్న హడావిడిలో డబ్బులు చెల్లించి ఆ బిల్లు ని చెత్త బుట్టలో వేసి చాక్లెట్ తీసుకుని వెళ్తున్నాడు.

Telugu Kidney, Telugu Nri Ups-

రసీదు చూపించమని సూపర్ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్ హనుమాన్ ని అడుగగా తానూ దీనికి బిల్లు చెల్లించానని, అయితే అది చెత్తబుట్టలో ఉందని తెలిపాడు.

హనుమాండ్ ఈ చాక్లెట్ దొంగిలిచి తీసుకువెళ్తున్నాడని భావించిన సెక్యూరిటీ గార్డ్ హనుమాన్ చేయి పట్టుకుని అందరూ చూస్తుండగానే బలవంతంగా స్టోర్ లోకి తీసుకుని వెళ్ళాడు.దాంతో చిర్రెత్తుకొచ్చిన హనుమాన్ సహజంగా లాయర్ కావడంతో సదరు మార్ట్ సెక్యూరిటీ గార్డ్ తనని బలవంతంగా తీసుకెళ్ళే క్రమంలో నా కిడ్నీలో రాళ్ళు కదిలిపోయాయి, ఈ క్రమంలో ఎంతో బాధని నేను అనుభవించాను నాకు నష్టపరిహారంగా 65 లక్షలు ఇప్పించండి అంటూ టెస్కో సూపర్ మార్ట్ పై కేసు ఫైల్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube