బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి, అందులో నటించే నటీనటుల గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రెటీలను కూడా ఆకట్టుకుంది.
ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ఎంత క్రేజ్ ఉందో మోనిత అనే విలన్ పాత్రకు కూడా అంతే క్రేజ్ వుంది.
నిజానికి మోనితకు ఈ సీరియల్ ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది.
ఈ సీరియల్ తోనే తను మంచి అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది.అయితే ఈ సీరియల్ లో ఇప్పటివరకు మోనిత పాత్ర ఎలా ఉందో చూసాం.
ప్రతిసారి దీపకు, కార్తీక్ కు అడ్డంగా ఉంటూ వారిని విడదీస్తూ వచ్చింది.ఇక మొన్నటివరకు స్టోరీలో అలాగే సాగింది మోనిత పాత్ర.
కానీ మోనిత జైలుకు వెళ్ళిపోవటంతో సీన్ మొత్తం మారిపోయింది.అయితే మోనిత జైలుకు వెళ్లి మళ్లీ వస్తుంది అని అందరూ అనుకున్నారు.కానీ ఇక మోనిత మళ్ళీ రాదు అని ఇక తన పాత్ర ముగిసింది అని తనే క్లారిటీ ఇచ్చింది.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
మోనిత అసలు పేరు శోభా శెట్టి.ఈమె కన్నడకు చెందిన నటి.
ఈమె కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.ప్రస్తుతం తెలుగులో హిట్లర్ గారి పెళ్ళాం, కార్తీకదీపం సీరియల్ లో బిజీగా ఉంది.ఏ సీరియల్ కు అందుకోనంత గుర్తింపు ఈ సీరియల్ తోనే అందుకుంది శోభా శెట్టి.పైగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇటీవలే తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.
కార్తీక దీపం సెట్ లో చాలా వీడియోలను తీసి అభిమానులకు పంచుకుంది.
గతంలో ఈ సీరియల్ లో తన పాత్ర ముగియటంతో ఆ సమయంలో కూడా వీడియో షేర్ చేసుకొని తన అభిమానులను బాధపెట్టింది.
ఇక మళ్లీ రీఎంట్రీ ఇవ్వగా తాజాగా మరోసారి తన పాత్ర ముగిసింది అంటూ యూట్యూబ్ లో వీడియో షేర్ చేసుకుంది.ఇక కార్తీకదీపం లో తన పాత్ర ముగిసింది అంటూ.
రీసెంట్ గానే ఈ విషయం ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి చెప్పారు అని మొదట నమ్మలేదు అని తెలిపింది.
కానీ ఇది నిజమని తెలిశాక చాలా బాధగా అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించింది శోభా శెట్టి.తను ఎన్నో సీరియల్స్ లలో చేశాను అని కానీ ఈ సీరియల్ తనకు బాగా గుర్తింపు ఇచ్చింది.ఈ సీరియల్లో తన పాత్ర ముగియటం తనకు చాలా బాధగా ఉంది అని ఎమోషనల్ అవుతూ తెలిపింది మోనిత.
దీంతో తన ఫ్యాన్స్ చాలా బాధపడుతూ తనకు ధైర్యం ఇస్తున్నారు.ఇక మొత్తానికి కార్తీకదీపం లో మోనిత పాత్ర ముగిసిందని అర్థమవుతుంది.