మునుగోడు లో మనీ పాలిటిక్స్ ? రంగంలోకి కుల నాయకులు 

అసలు రాజకీయాలు అంటేనే డబ్బు ! డబ్బు చుట్టూనే రాజకీయం తిరుగుతూ ఉంటుంది.ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో సక్సెస్ కావాలంటే చుట్టూ మందీ మార్బలాన్ని వెంటేసుకుని తిరగాల్సిందే.

 Money Politics In The Past? Caste Leaders Into The Field,munugodu Asembly Electi-TeluguStop.com

వారికోసం ప్రతిరోజు సొమ్ములు ఖర్చు చేయాల్సిందే.ఇక ఎన్నికల సమయంలో నాయకుడు ప్రచారానికి తిరిగే సమయంలో అభిమానంతో వెంట వచ్చేవారు కొందరైతే,  సొమ్ములు తీసుకుని ప్రచారానికి వచ్చేవారు చాలామంది ఉంటారు.

ఇక ఎన్నికల్లో ఓటర్లకు ఓటుకు నోటు రహస్యంగా ఇస్తూ వారి ఓట్లు తమకు పడేలా చూసుకుంటూ ఉంటారు.ఇక కుల సంఘాల నాయకులకు ఎన్నికల సమయంలో డిమాండ్ బాగానే ఉంటుంది.

తమ సామాజిక వర్గం ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో చెబుతూ, తమ వ్యాల్యూని పెంచుకునేందుకు కుల సంఘాల నాయకులు ప్రయత్నిస్తూ ఉంటారు,
  ఇక రాజకీయ పార్టీలు ఆయా కుల సంఘాల నాయకులను తమ వైపుకు తిప్పుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.ప్రస్తుతం తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా కుల సంఘాల నాయకులకు ఇదే విధంగా మంచి డిమాండ్ ఏర్పడింది.

కాంగ్రెస్ , టిఆర్ఎస్ ఈ మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొనడం , ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో,  ఏ ఒక్క ఓటు చేయి జారిపోకుండా రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో కుల సంఘాల నాయకులు గ్రామాలు వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ఏదో ఒక పార్టీ తరఫున ఒకంత పుచ్చుకొని వారికి ఓట్లు వేయాలంటూ.

తమ వర్గం ప్రజలకు నూరుపోస్తూ వస్తున్నారు .అంతేకాదు సామాజిక వర్గం లోని వారికి ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేస్తూ వారి మద్దతు తమకు ఉండేలా ఆయా.పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి . కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ,బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , టిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ పోటీ చేస్తున్నారు.
 

Telugu Komatirajagopal, Komati Venkata, Munugodu, Telangana, Vote-Political

వీరంతా ఓటర్లు ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి పల్లెలోని ప్రతి గడపను సందర్శిస్తూ,  తమ ఓటు బ్యాంకు చెల్లా చెదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారు.తమ సామాజిక వర్గం వారు ఇంతమంది ఉన్నారని , తమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ కొంతమంది కుల సంఘాల నాయకులు  ఆయా పార్టీ లకు డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.ఇక ఓటర్ల లో ఎక్కువ మంది ఆయా పార్టీలు సొమ్ములు గట్టిగానే ఖర్చుపెడతాయని , ఎవరు ఎక్కువ ఇస్తారో వారికే తమ ఓటు అన్నట్టుగా మాట్లాడుతుండడం, ఇక అన్ని పార్టీలు ఎన్నికల్లో సొమ్ములు ఖర్చు పెట్టేందుకు ఏమాత్రం వెనకాడకపోవడం వంటివి ఓటర్లలోనూ, కుల సంఘాల నాయకుల్లోనూ ఆశలు పెంచుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube