కిడ్నీ డ్యామేజ్ (మూత్రపిండాలు దెబ్బ తినడం) ఇటీవల కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరో ఈ సమస్యతో మృత్యువాత పడుతున్నారు.అలాగే మరెందరో ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటూ మంచానికి పరిమితం అయిపోతున్నారు.
నిజానికి రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ, శరీరంలో మలినాలను బయటకు పంపడంలోనూ, మనం తీసుకునే ఆహారాల నుంచి పోషకాలను గ్రహించడంలోనూ కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.ఇంకా మరోన్నె క్రియలను కూడా నిర్వహిస్తాయి.
కానీ తెలిసో, తెలియకో మనం చేసే పొరపాట్లే మూత్రపిండాలు దెబ్బ తినడానికి కారణాలు అవుతాయి.మరి ఆ పొరాపాట్లు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి టెక్నాలజీ యుగంలో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తూ క్రమంగా నిద్రలేమికి గురవుతున్నారు.అయితే కిడ్నీ డ్యామేజ్‌కు నిద్ర లేమి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.కిడ్నీ టిష్యుల రిపేర్‌కు మరియు కొత్త టిష్యుల ఏర్పాటుకు నిద్ర ఎంతో అవసరం.కాబట్టి, ఇకపై టైమ్‌కి పాడుకోవడం అలవాటు చేసుకోండి.
అతిగా కాపీలు, టీలు, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతుంటాయి.సో వీటిని తీసుకోవడం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.అలాగే కొందరు ఉప్పును పరిమితికి మించి తీసేసుకుంటారు.దాంతో కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా, అవి దెబ్బ తినడం స్టార్ట్ అవుతుంది.
చాలా మంది వాటర్‌ను తాగడంలో పెద్ద శ్రద్ధ పెట్టరు.కానీ, శరీరానికి సరిపడా నీరు అందకపోయినా కిడ్నీ డ్యామేజ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇక ఏ చిన్న నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్స్ వేసుకునే అలవాటు ఎందరికో ఉంటుంది.
అయితే తరచూ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్లా మూత్ర పిండాలు దెబ్బ తింటాయి.ఇక, ప్రోటీన్ ఫుడ్ ఓవర్‌గా తీసుకోవడం, పోషకాల కొరతను పట్టించుకోకపోడం, ఆల్కహాల్ అధికంగా సేవించడం వంటివి కూడా కిడ్నీ డ్యామేజ్ కు కారణాలు అవుతాయి.కాబట్టి, ఇకపై ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి.ఆరోగ్యంగా ఉండండి.