'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రన్ టైం లాక్.. డీసెంట్ నిడివితో బరిలోకి రెడీ!

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty ) స్ట్రాంగ్ కంబ్యాక్ కు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.ఈ స్టార్ హీరోయిన్ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.

 Miss Shetty Mr Polishetty Runtime Locked, Anushka Shetty, Naveen Polishetty,-TeluguStop.com

( Miss Shetty Mr Polishetty ) సినిమాతో మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఈమె సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty ) హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి.ఈ సినిమా మరోసారి ఆగస్టు లోనే రిలీజ్ అవ్వాల్సి ఉంది.

కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాక పోవడంతో ఈ సినిమాను వాయిదా వేసి ఇప్పుడు సెప్టెంబర్ లో ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ వీకెండ్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకుంటుంది.పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ ఇప్పటికే పూర్తి చేసుకుంది.యూ/ఏ (U/A) సర్టిఫికెట్ పొందగా ఇప్పుడు రన్ టైం బయటకు వచ్చింది.

మొత్తం 2 గంటల 29 నిముషాల నిడివితో ( Runtime ) రాబోతుంది.మరి ఇది పెర్ఫెక్ట్ నిడివి కావడంతో పాజిటివ్ బజ్ వస్తే అలరించడం ఖాయం.

ఇక సెప్టెంబర్ 7న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.క్లీన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ ( UV Creations Banner ) వారు నిర్మిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.చూడాలి అనుష్క శెట్టి మంచి కమ్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ వరుస సినిమాలతో అలరిస్తుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube