ఓవర్సీస్ లో 'బ్రో ది అవతార్' కలెక్షన్స్ ని దాటేసిన 'మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి'..!

రీసెంట్ గా విడుదలైన సినిమాలు కొన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయినా, ఓవర్సీస్ లో మాత్రం దుమ్ములేపాయి.రెండు వారాల క్రితం విడుదలైన విజయ్ దేవరకొండ ‘ఖుషి’ చిత్రానికి( Kushi Movie ) అదే జరిగింది.

 Miss Shetty Mr Polishetty Movie Overseas Collections Crossed Bro The Avatar Movi-TeluguStop.com

ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.అద్భుతమైన పాటలు, యూత్ ని ఆకర్షించే కంటెంట్ మరియు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఎందుకు కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యిందో ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు.

ఇక పడి రోజుల క్రితం విడుదలైన ‘మిస్ శెట్టి.మిస్టర్ పోలిశెట్టి’ సినిమా( Miss Shetty Mr Polishetty ) కూడా ఇలాగే అవుతుందని అనుకున్నారు.

ఎందుకంటే ఈ సినిమాకి ఓపెనింగ్స్ చాలా తక్కువ వచ్చాయి.కానీ మౌత్ టాక్ బాగా ఉండడం తో వీకెండ్ లో పుంజుకొని ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తుంది.

Telugu Anushka Shetty, Bro Avatar, Jailer, America, Pawan Kalyan-Movie

ఇప్పటి వరకు ఈ చిత్రానికి 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా కూడా నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు.కేవలం 13 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమాకి 9 రోజుల్లో అంటే 19 కోట్ల రూపాయిలు వచ్చాయి.అంటే ఆరు కోట్ల రూపాయిలు లాభం వచ్చింది అన్నమాట.

ఫ్లాప్ అవుతుంది అనుకున్న సినిమాకి ఇంత లాభం రావడం అనేది సాధారణమైన విషయం కాదు.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి ఓవర్సీస్ లో వస్తున్న వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.

నిన్నటితో ఈ సినిమా నార్త్ అమెరికా లో రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’( Bro The Avatar ) చిత్రం ఫుల్ రన్ వసూళ్లను దాటేయడం విశేషం.

Telugu Anushka Shetty, Bro Avatar, Jailer, America, Pawan Kalyan-Movie

‘బ్రో ది అవతార్’ చిత్రానికి నార్త్ అమెరికా లో( North America ) 13 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తే , ‘మిస్ శెట్టి.మిస్టర్ పోలిశెట్టి’ చిత్రానికి 14 లక్షల డాలర్లు వచ్చాయి.ఈ సినిమా వచ్చిన సమయానికి ఏ సినిమా లేకపోవడం కూడా ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణం అని అంటున్నారు.‘బ్రో ది అవతార్’ సినిమా రన్నింగ్ సమయం లో నార్త్ అమెరికా లో మూడు హాలీవుడ్ కొత్త సినిమాలతో పాటుగా , సూపర్ స్టార్ రజినికాంత్ ‘జైలర్’( Jailer Movie ) చిత్రాలు కూడా ఉన్నాయి.అందుకే అమెరికా లో బ్రో చిత్రానికి పవర్ స్టార్ రేంజ్ కి తగ్గ థియేటర్స్ దక్కలేదని , అందుకే అక్కడ తక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube