బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.ఇందులో భాగంగా ముందుకు అమిత్ షా నాగపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు.
ఈ మేరకు మధ్యాహ్నం 1.50 గంటలకు అమిత్ షా నాగపూర్ నుంచి బయలుదేరనున్నారు.మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ కు రానున్నారు.తరువాత మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.అనంతరం సాయంత్రం 5.05 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.ఈ క్రమంలోనే సాయంత్రం 5.20 గంటలకు ఐటీసీ కాకతీయలో అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు.అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్ కు వెళ్లనున్న అమిత్ షా రాత్రి 7.40 గంటలకు ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.కాగా ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉండగా రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.నాయకులతో భేటీ ముగిసిన తరువాత రాత్రి 9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి అమిత్ షా ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.