క్యాప్సికం పంటకు( capsicum cultivation ) మార్కెట్లో డిమాండ్ ఉండడంతో.రైతులు క్యాప్సికం పంట సాగు వైపు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే క్యాప్సికం పంట సాగు విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు రైతులు( Farmers ) సాగు చేయడానికి భయపడుతుంటే మరి కొంతమంది సాగు చేసి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా క్యాప్సికం పంట సాగుకు స్పాటేడ్ విల్డ్ వైరస్ బెడద చాలా ఎక్కువ.
తెగులు సోకిన క్యాప్సికం మొక్కలను ఈ వైరస్ ఆహారంగా తీసుకుంటుంది.
క్యాప్సికం మొక్క ఆకులపై ఊదా లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా లేత ఆకులు మాడిపోవడం ప్రారంభం అయితే ఆ మొక్కలకు ఈ వైరస్ సోకినట్టే.మొక్క పై భాగంలో ఈ వైరస్ ను గుర్తించవచ్చు.ఈ వైరస్ ను గుర్తించి అరికట్టకపోతే మొక్క కణజాలాలను పూర్తిగా నాశనం చేసేస్తాయి.
క్యాప్సికం కాయలపై కూడా మచ్చలతో కూడిన గోధుమ రంగు వలయాలు ఏర్పడతాయి.ఈ కాయలు మార్కెట్లో అమ్మకానికి పనికిరావు.
తెగులు నిరోధక ( Pest resistant )రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.పొలంలో పొలం గట్లపై కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.ఈ వైరస్ సోకిన మొక్కలను పంట నుండి పీకేసి కాల్చి నాశనం చేయాలి.అధిక మోతాదులో నత్రజని ఎరువులను ఉపయోగించకూడదు.ఈ వైరస్ కు అతిథులుగా ఉండే ఇతర మొక్కల వద్ద ఈ పంటను సాగు చేయకూడదు.సేంద్రీయ పద్ధతిలో( Organic method ) ఈ వైరస్ ను అరికట్టాలంటే.
ఆకుల కింది భాగంలో వేప నూనె లేదంటే స్పైనోసాడ్ లను వాడాలి.అల్లం కషాయాన్ని ఉపయోగించడం వల్ల కొన్ని రకాల కీటకం నాటలను కూడా అరికట్టవచ్చు.
రసాయన పద్ధతిలో ఈ వైరస్ ను అరికట్టాలంటే.పెరిథ్రోయిడ్స్ పురుగు మందులను పెప్పరోనిల్ బుటాక్సైడ్ తో కలిపి మొక్కలపై పిచికారీ చేసి అరికట్టవచ్చు.