ఉద్యానవన పంటలైన దానిమ్మ, జామ, చామంతి, గులాబీ, సపోటా ( Sapodilla )మొదలగు పంటలకు పిండి నల్లి పురుగులు అధికంగా పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఉద్యానవన పంటలను సాగు చేస్తున్న రైతులు పిండి నల్లి( Mealy Bug ) పురుగులు ఎటువంటి సందర్భాల్లో పంటను ఆశిస్తాయి.
వీటిని ఎలా గుర్తించి ఎలా అరికట్టాలి అనే వాటిపై వ్యవసాయ క్షేత్రం నిపుణుల సలహాతో అవగాహన కల్పించుకుని వీటిని అరికట్టకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది.
పిండి నల్లి పురుగులు లేత ఆకులపై, కాండం మరియు ఆకులపై తెల్లని దూదితో కప్పబడి ఉండి రసం పీల్చడం వల్ల మొక్కలు గిడసబారి తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఈ పురుగులు ఆకుల కింది భాగం నుండి రసాన్ని పీల్చడంతో పాటు జిగురు వంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు వ్యాప్తి చెందుతుంది.ఈ పురుగులు పసుపు రంగులో ఉండి వీటి శరీరం అంతా తెల్లటి మైనంతో కప్పబడి ఉంటాయి.
ఈ పురుగులు ఒకేసారి 150 గుడ్లను పెడతాయి.కేవలం గుడ్లు పెట్టిన పది రోజులలో గుడ్లు పొదగబడి పిల్ల పురుగులు బయటకి వస్తాయి.
ఈ పురుగులు సాగునీరు, గాలి, పంటకు వాడే పనిముట్ల ద్వారా పొలంలోకి చేరుతాయి.ఈ పురుగులు పిల్లదశలో ఉన్నప్పుడే అరికట్టాలి.
పిండి నల్లి పురుగులు ఆశించిన ముక్కలను వెంటనే పీకేయాలి.చీమల ద్వారా కూడా ఈ పురుగులు పంట పొలంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చీమలను కూడా అరికట్టాలి.ఒక లీటర్ నీటిలో 2.0 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ కలిపి చీమలు ఉండే ప్రాంతంలో పిచ్చికారి చేయాలి.వేప గింజల కషాయం( Neem decoction ) 5% పిచికారి చేసుకుని చెట్టు మొదల వద్ద క్లోరోపైరిఫాస్ ద్రావణం తో పిచికారి చేయడం వల్ల మొదటి దశలోనే పురుగుల వ్యక్తి అరికట్టవచ్చు.ఒకవేళ ఈ పురుగుల వృద్ధుత్తి కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటిలో ఇమిడా క్లోప్రిడ్ 0.6మి.లీ కలిపి పిచికారి చేస్తే పూర్తిగా అరికట్టవచ్చు.