రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అని అనిపిస్తుంటుంది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు వైరల్!

మెగాస్టార్ చిరంజీవి 2008 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ తరపున అభ్యర్థులను పోటీ చేయించగా 18 అసెంబ్లీ స్థానాలలో ఆ పార్టీ విజయం సాధించింది.తాజాగా తాప్సీ ప్రధాన పాత్రలో నటించి థియేటర్లలో విడుదలవుతున్న మిషన్ ఇంపాజిబుల్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

 Megastar Chiranjeevi Comments In Mission Impossible Pre Release Event Goes Viral-TeluguStop.com

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కొన్ని వేడుకలకు ప్రేమతో వెళతామని మరికొన్ని వేడుకలకు తప్పదని వెళతామని నిర్మాత నిరంజన్ పై ఉన్న ప్రేమ వల్లే తాను ఈ ఈవెంట్ కు హాజరయ్యానని చిరంజీవి తెలిపారు.

నిరంజన్ తనకు పరిచయమైన కొంతకాలంలోనే ఆత్మీయుడిగా మారాడని చిరంజీవి పేర్కొన్నారు.నిరంజన్ సుప్రీం కోర్టు లాయర్ కావడంతో ఆయన లేకుండా ఆచార్య షూటింగ్ ఏ విధంగా పూర్తవుతుందో అని తాను కంగారు పడ్డానని చిరంజీవి అన్నారు.

Telugu Chiranjeevi, Niranjan, Poltics, Praja Rajyam, Prajarajyam, Pre, Taapsee P

ఆ సమయంలో నిరంజన్ బ్రదర్ అవినాష్ మమ్మల్ని సమర్థంగా ముందుకు నడిపించారని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.ఈ సినిమాలో తాప్సీ పాత్ర అద్భుతంగా ఉంటుందని చిరంజీవి అన్నారు.తాను రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తాప్సీతో నటించే ఛాన్స్ ను చేజిక్కించుకోలేదని చిరంజీవి కామెంట్లు చేశారు.ఇలాంటి వారిని చూసిన సమయంలో నేను రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అని అనిపిస్తుంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Telugu Chiranjeevi, Niranjan, Poltics, Praja Rajyam, Prajarajyam, Pre, Taapsee P

మిషన్ ఇంపాజిబుల్ సినిమా చిన్న సినిమా అని అనుకోవద్దని ఈ సినిమా పెద్ద సినిమా అని చిరంజీవి కామెంట్లు చేశారు.ఈ మూవీలో ముగ్గురు బాలనటులు బాగా నటించారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సినిమాలో చిన్నారుల యాక్టింగ్ ను ప్రత్యేక దృష్టితో చూశానని చిరంజీవి చెప్పుకొచ్చారు.మిషన్ ఇంపాజిబుల్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube