ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ వావి వరుసలు మరచి ప్రవర్తిస్తూ చివరికి ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.తాజాగా ఓ వివాహితని తన మరిది అత్యాచారం చేయాలని యత్నించడంతో ఆమె తిరగబడి దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని తిరువన్నమలై పరిసర ప్రాంతంలో “పరాశక్తి” అనే వివాహిత తన భర్త, పిల్లలతో కలిసి నివాసముంటుంది.కాగా పరాశక్తి భర్త కుటుంబ పోషణ నిమిత్తమై “ట్రక్కు డ్రైవర్” గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఎక్కువగా బయట ప్రాంతాలకు వెళుతూ వస్తుంటాడు.అంతేగాక ఒక్కోసారి వారం, పది రోజుల పాటూ బయట ప్రాంతాల్లో గడుపుతూ ఉంటాడు.
దీంతో పరాశక్తి తన పిల్లలను చూసుకుంటూ, వారి యోగ క్షేమాలను చూసేది.కాగా పరాశక్తి భర్త సోదరుడు రాజా కూడా వీరు ఉంటున్న ఏరియాలో నివాసం ఉంటున్నాడు.
గత కొద్ది కాలంగా రాజా చెడు అలవాట్లకు బానిస కావడంతో అతని భార్య వదిలేసింది.దీంతో రాజా కన్ను తన వదిన పై పడింది.

ఈ క్రమంలో పరాశక్తి భర్త ఇంట్లో లేని సమయంలో రాజా ఇంటికి వచ్చి డబుల్ మీనింగ్ డైలాగులు మరియు వెకిలి చేష్టలతో ఆమెను లైంగికంగా వేధించేవాడు.కుటుంబ పరువును దృష్టిలో ఉంచుకుని పరాశక్తి తన భర్తతో ఈ విషయాల గురించి చర్చించేది కాదు.దీనిని అలుసుగా తీసుకున్న రాజా చేష్టలు రోజు రోజుకి ఎక్కువయ్యాయి.కాగా తాజాగా రాజా ఫుల్లుగా మద్యం సేవించి తన సోదరుడు ఇంట్లో లేని సమయంలో వదినను చెరబట్టాలని బెడ్రూంలోకి దూరి ఆమెపై అత్యాచారం చేయాలని ప్రయత్నించాడు.
దీంతో తనను తాను రక్షించుకునేందుకు పరాశక్తి తన మరిదిపై చేతికందిన కత్తితో దారుణంగా దాడి చేసింది.దాంతో గాయాలు బలంగా తగలడంతో రాజా అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అలాగే నిందితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.