ఈమధ్య కాలం లో రీ రిలీజ్ సినిమాలు టాలీవుడ్ లో ఒక ట్రెండ్ లాగ మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వాళ్ళ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేస్తుంటారు.
ఇది ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్ గా మారిపోయింది.ఇక అక్కినేని నాగార్జున( Nagarjuna ) పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా పిలవబడే మన్మథుడు చిత్రాన్ని గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.గత రెండు మూడేళ్ళ నుండి విడుదలైన నాగార్జున సినిమాలను మనం గమనిస్తూనే ఉన్నాము.
ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి.కొన్ని సినిమాలు అయితే కనీసం సింగల్ డిజిట్ షేర్ కి కూడా నోచుకోలేదు.
అలాంటిది మన్మథుడు చిత్రం విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి.నాగ్ సినిమాకి ఇలా చూసి ఎన్ని రోజులు అయ్యిందో అని ఆయన అభిమానులు సోషల్ మీడియా( Social media ) లో సంతోషం తో పోస్టులు పెడుతున్నారు.ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కచ్చితంగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంటున్నారు.ఉదయం ఆటల నుండే మంచి ఆక్యుపెన్సీలు రావడం తో సాయంత్రం నుండి షో బాగా పెంచేశారు.
అలా పెంచిన షోస్ అన్నిటికీ అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.రీసెంట్ గా విడుదలైన కొన్ని కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ ఆక్యుపెన్సీలు లేవు.మొదటి నుండి నాగార్జున నైజాం ప్రాంతం లో బాగా స్ట్రాంగ్.కానీ ఈమధ్య వరుసగా ఫ్లాప్స్ రావడం తో ఆయన నైజాం మార్కెట్ లో బాగా వెనుకపడ్డాడు.
కానీ ఇప్పుడు నైజాం ప్రాంతం లో ‘మన్మథుడు( Manmadhudu )’ సినిమా రీ రిలీజ్ కి వచ్చిన వసూళ్లు చూస్తూ ఉంటే సరైన కంటెంట్ పడితే నాగార్జున ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపేస్తాడు అని అర్థం అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.కేవలం నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి మొదటి రోజు 50 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది, అలాగే ఓవర్సీస్ లో కూడా 20 వేల డాలర్లు వస్తుందట.నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ సినిమాలోని కొన్ని కామెడీ సన్నివేశాలకు నేడు థియేటర్స్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.ముఖ్యంగా బ్రహ్మానందం( Brahmanandam ) కామెడీ సన్నివేశాలకు అయితే ప్రేక్షకులు థియేటర్స్ లో కాగితాలు ఎగరవేశారు.
దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.