హీరో నాని కి 50 లక్షలు బహుమతిగా ఇచ్చిన మంచు మనోజ్..!

మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు మనోజ్( Manchu Manoj ) కి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.మంచు ఫ్యామిలీ హీరోలందరూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్ అవుతూ వస్తుంటారు, కానీ మనోజ్ కి మాత్రం మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

 Manchu Manoj Gave A Gift Of 50 Lakhs To Hero Nani, Manchu Manoj , Nani , Tollyw-TeluguStop.com

ఆయన సినిమాలు, ఆయన సినిమాల్లోని పాటలు ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే చాలా కాలం బ్రేక్ ఇచ్చిన మనోజ్, మళ్ళీ ఇన్నాళ్లకు వెండితెర మీద కనిపించబోతున్నాడు.

వరుసగా రెండు మూడు సినిమాల్లో నటించడానికి సంతకాలు చేసిన మనోజ్, వెండితెర మీద కనిపించే ముందు ఈటీవీ లో ‘ఉస్తాద్’ అనే గేమ్ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు.ఈ షో కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చెయ్యగా దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Telugu Manchu Manoj, Nani, Factory, Tollywood, Ustaad-Movie

మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్ నాని( Nani ) విచ్చేశాడు.ఆయనతో పాటు ఆయన అభిమానిగా సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయినా శ్రీప్రియ కూడా విచ్చేసింది.ఆమె గురించి నాని చెప్తూ ‘ఈ అమ్మాయి నా పెద్ద ఫ్యాన్.నాకంటే ఎక్కువ ఫేమస్ అయ్యింది సోషల్ మీడియా లో’ అంటూ పరిచయం చేస్తాడు.అనంతరం చాలా గేమ్స్ ఆడుతారు.మంచు మనోజ్ తో నాని చేసిన ఫన్ బాగా పేలింది.

చూస్తూ ఉంటే వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్టుగా అర్థం అవుతుంది.అయితే ఈ షో కాన్సెప్ట్ మొత్తం చాలా కొత్తగా ఉన్నట్టుగా అనిపించింది.

నాని తో కలిసి పని చేసిన హీరోయిన్స్ అందరి ఫోటోలను ఎల్ఈడీ మీద చూపించి వీళ్లందరినీ వారి వయస్సుకి తగ్గట్టుగా క్రమం లో పెట్టండి అని నాని కి చెప్తాడు మంచు మనోజ్.ఆయన ఈ రౌండ్ లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Telugu Manchu Manoj, Nani, Factory, Tollywood, Ustaad-Movie

అలాగే నాని ని 50 లక్షల రూపాయిలు గెలుచుకునే ప్రశ్న ఒకటి అడుగుతాడు.ఈ ప్రశ్న కి సరైన సమాధానం చెప్పి 50 లక్షలు గెలుచుకుంటాడా లేదా అనేది కూడా సస్పెన్స్ అన్నారు కానీ, 50 లక్షల రూపాయిలు గెలిచేసుకున్నాడు అని టాక్ ఉంది.ఈ షో ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory ) నిర్మిస్తుంది.సరికొత్త కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఈ షో ఎంతమేరకు ఆడియన్స్ ని రీచ్ అవుతుందో చూడాలి.

తదుపరి ఎపిసోడ్ లో మాస్ మహారాజ రవితేజ మరియు విశ్వక్ సేన్ పాల్గొన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube