ఆ ముగ్గురు టాలీవుడ్ హీరోలకు నేనంటే చాలా చులకన.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్?

మోహన్ బాబు( Mohan Babu ) వారసురాలిగా మంచు లక్ష్మి ( Manchu Lakshmi ) ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించారు.

 Manchu Lakshmi Shocking Comments On Tollywood Three Heroes , Manchu Lakshmi, Tal-TeluguStop.com

అనంతరం పలు సినిమాలలో నెగిటివ్ పాత్రలలో కూడా నటించారు.ఇలా సినిమాలు మాత్రమే కాకుండా లక్ష్మీ మంచు పలు టాక్ షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

అయితే గతంలో ఈమె టాలీవుడ్ హీరోల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈమె ఆహాలో ఒక కుకింగ్ షో కూడా చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమానికి కూడా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్( Allu Arjun ) రామ్ చరణ్ ( Ramcharan ) ప్రభాస్ ( Prabhas )వంటి హీరోల గురించే సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ముగ్గురు హీరోలు నా టాక్ షోలకు పెద్దగా హాజరు కారు అంటూ ఈమె తెలిపారు.ఎందుకు ఈ హీరోలు తమ టాక్ షోలకు హాజరు కారనే ప్రశ్న ఎదురు కావడంతో ఈమె సమాధానం చెబుతూ ఈ ప్రశ్న నన్ను కాకుండా వారిని అడిగితే సమాధానం దొరుకుతుందని తెలిపారు.

ఈ ముగ్గురు హీరోలకు బహుశా నా షోస్ అంటే చులకనేమో అందుకే నా షోలకు రారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈమె వ్యాఖ్యలపై కొందరు స్పందిస్తూ గతంలో ఈమె లక్ష్మీ టాక్ షో నిర్వహించిన సమయంలోను అలాగే ఈటీవీలో కొన్ని టాక్ షోలను నిర్వహించిన సమయంలో ప్రభాస్ ఎన్టీఆర్ ఇతర టాలీవుడ్ స్టార్స్ అందరు కూడా హాజరయ్యారని కానీ వీరి విషయంలో మంచు లక్ష్మి ఇలాంటి కామెంట్ చేయడానికి కారణం ఏంటో తెలియడం లేదు అంటూ ఈమె వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube