యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాతో ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకునేందుకు అఖిల్ గట్టిగా ప్రయత్ని్స్తున్నాడు.
ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే అఖిల్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
టాలీవుడ్ స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ‘ఏజెంట్’ అనే థ్రిల్లర్ యాక్షన్ చిత్రంలో అఖిల్ నటించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశాడు.
అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టిని తీసుకునేందుకు సురేందర్ రెడ్డి ప్లా్న్ చేస్తున్నాడు.ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నటించేందుకుగాను మమ్ముట్టి ఏకంగా రూ.3 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో అఖిల్ సరికొత్త అవతారంలో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాను 24 డిసెంబర్ 2021న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.మరి ఈ సినిమాలో మమ్ముట్టి ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.
ఇక అతి త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు.అన్నీ అనుకున్నట్లు జరిగితే తాము అనుకున్న సమయానికే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తున్నారు.