మహేష్ బాబు "గుంటూరు కారం" ట్రైలర్ విడుదల..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం( Guntur Kaaram )” ట్రైలర్ రిలీజ్ అయింది.విడుదలైన పోస్టర్స్ లో ఉన్నట్టుగానే ట్రైలర్ కూడా మాస్ రేంజ్ లో ఉంది.

 Mahesh Babu Guntur Kaaram Trailer Released, Trivikram, Mahesh Babu, Guntur Kaar-TeluguStop.com

మహేష్ బాబుని డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా పవర్ ఫుల్ గా చూపించారు.కొడుకు తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో సినిమా చిత్రీకరణ జరిగినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తుంది.

చాలా ఉరా మాస్ పాత్రలో.మహేష్ బాబుని చూపించారు.

ప్రకాష్ రాజ్( Prakash Raj ) విలన్ పాత్రలో.మహేష్ తల్లిగా రమ్యకృష్ణ నటించినట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది.

రావు రమేష్ కూడా కీలక పాత్ర పోషించారు.

శ్రీలీల, మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) లను కూడా ట్రైలర్ లో అద్భుతంగా చూపించడం జరిగింది.థమన్ మ్యూజిక్ కూడా బాగుంది.జనవరి 12వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఈ క్రమంలో జనవరి 6వ తారీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో రద్దయింది. హైదరాబాద్ పోలీసులు అనుమతులు ఇవ్వలేదు.దీంతో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మరో తేదీని ప్రకటించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.ఆల్రెడీ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ అతడు, ఖలేజా సినిమాలు చేయడం జరిగింది.

ఈ రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.వీరి కాంబినేషన్ లో దాదాపు 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube