టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు మహేష్ బాబు (Mahesh Babu) ఒకరు ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా ఎన్నో కమర్షియల్ యాడ్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా నిజ జీవితంలో కూడా ఈయన మంచి మనసున్న హీరో అనిపించుకున్నారు.
మహేష్ బాబు ఇప్పటివరకు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు.ఇక ఈయన ఒక్కో సినిమాకు దాదాపు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి మహేష్ బాబు తన రెమ్యూనరేషన్ లోని కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే మహేష్ బాబు ఫౌండేషన్(Mahesh Babu Foundation) ద్వారా ఈయన కొన్ని వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తూ వారికి పునర్జన్మను అందించారు ఇలా ఎంతో మంది చిన్నారులకు ప్రాణం పోశారు.
ఇలా చిన్నారుల గుండె ఆపరేషన్ మాత్రమే కాకుండా తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అనాధ పిల్లలను చదివిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు అదేవిధంగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాలలో మౌలిక సదుపాయాలు అన్నింటిని కూడా సమకూరుస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన ఎంతో మంచి సేవ చేస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా తాను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి గొప్పగా చెప్పుకోరు.ఇలా మహేష్ బాబు చేస్తున్నటువంటి ఈ మంచి పనులు తెలిసి ఆయనకు మరింత మంది అభిమానులుగా మారిపోయారు.
ఇకపోతే తాజాగా మహేష్ బాబుకి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో భాగంగా ఓ కార్యక్రమం నిమిత్తం మహేష్ బాబు తన భార్య నమ్రత(Namrata) తో కలిసి వచ్చారు.అయితే వెనుకనే ఒక అభిమాని(Mahesh Babu Fan) మహేష్ బాబు వెంట వస్తూ ఆయనని టచ్ చేసి ఆ చేతినీ తన గుండెల పై పెట్టుకొని నమస్కరించుకున్నారు ఇలా మహేష్ బాబుని తాకగానే ఆయన నమస్కరించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఈ వీడియో పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
సాధారణంగా మనం దేవుడిని తాకి మన గుండెకు చేతులను హత్తుకుంటాము అలాగే ఈయన కూడా దేవుడి రూపంలో ఉన్నటువంటి మహేష్ బాబుని తాకగానే ఇలా తన గుండెకు చేతులను తాకారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.నిజంగానే మహేష్ బాబు దేవుడు లాంటి వారు ఈయన ఎంతోమంది చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించి వారి పట్ల దేవుడిగా నిలిచారని మహేష్ బాబు మంచితనం పై, ఆయన చేస్తున్నటువంటి మంచి పనులపై కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో ప్రతి ఒక్క అభిమానిని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.