ఆస్ట్రేలియాలోని( Australia ) విక్టోరియా రాష్ట్రంలో గత నెలలో జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు భారత సంతతి వ్యక్తులు మరణించిన ఘటనకు సంబంధించి 66 ఏళ్ల డ్రైవర్‌పై పోలీసులు సోమవారం అభియోగాలు మోపారు.అతను తన ఎస్‌యూవీతో రాయల్ డేల్స్‌ఫోర్డ్ హోటల్లోని ( Royal Daylesford Hotel with an SUV )బీర్ గార్డెన్‌లోకి నవంబర్ 5న వీకెండ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మూడు కుటుంబాలకు చెందిన పది మందిని ఢీకొట్టాడు.
ఈ ఘటనకు సంబంధించి విక్టోరియా పోలీస్ మేజర్ కొలిజన్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (ఎంసీఐయూ) డ్రైవర్‌పై పలు అభియోగాలు నమోదు చేసింది.మౌంట్ మెసిడోన్కు చెందిన డ్రైవర్ విలియం స్వాలే( William Swale ) అనే వ్యక్తి మెల్బోర్న్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు.
సంఘటన జరిగిన రోజున డేల్స్ఫోర్డ్లోని ఆల్బర్ట్ స్ట్రీట్ వెంబడి స్వాలే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతను కుడి చేతి వంపును తప్పించి కెర్బ్ మీదకు దూసుకెళ్లాడు.ఆపై రాయల్ డేల్స్‌ఫోర్డ్ హోటల్ వెలుపల కూర్చొన్న 10 మందిని ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో టార్నీట్కు చెందిన వివేక్ భాటియా (38), కుమారుడు విహాన్ (11), ప్రతిభా శర్మ( Pratibha Sharma ) (44), ఆమె కుమార్తె అన్వీ (9), జతిన్ చుగ్ (30) ప్రాణాలు కోల్పోయారు.భాటియా భార్య రుచి (36), చిన్న కుమారుడు అబీర్ (6), 11 నెలల చిన్నారి సహా మరో ఐదుగురు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.11 నెలల చిన్నారి, 43 ఏళ్ల కైనెటన్ మహిళ, కాకాటూకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇప్పటి వరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని విక్టోరియా పోలీసులు తెలిపారు.
తన క్లయింట్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని స్వాలే తరపు న్యాయవాది మార్టిన్ అమద్( Martin Amad ) పేర్కొన్నారు.అతని బ్లడ్ శాంపిల్‌లో ఆల్కహాల్ రీడింగ్ నెగెటివ్‌గా వచ్చిందని లాయర్ తెలిపారు.ఘటన తర్వాత అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడని అమద్ వెల్లడించారు.
ఈ ప్రమాదంపై విక్టోరియా పోలీస్ చీఫ్ కమీషనర్ షేన్ పాటన్ మీడియాతో మాట్లాడుతూ.బాధితులందరూ ఈ ప్రాంతానికి సందర్శకులుగానే వచ్చారని చెప్పారు.
ప్రమాదంలో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడి కోలుకున్నారని పాటన్ తెలిపారు.అతడికి ఆల్కహాల్ టెస్ట్ చేయగా మద్యం తీసుకోలేదని, బ్లడ్ శాంపిల్స్‌ను మరింతగా విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు.