రామాయణం ఇతిహాసం మీద ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి.ఎన్నిసార్లు చుసిన ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రామాయణం నేపథ్యంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ ఒక గాసిప్ హల్ చల్ చేస్తుంది.
మహేష్ బాబుతో కూడా రామాయణం నేపథ్యంలో ఒక సినిమా చేయడానికి ఎప్పటి నుండో సన్నాహాలు జరుగుతున్నాయట.మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ మహేష్ అందుకు ఆసక్తిగా లేదు.కానీ ఇప్పుడు అందరు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తమ మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు.
అందుకే మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతుందనే టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి తో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.
అయితే బాలీవుడ్ బడా నిర్మాత మధు మంటేనా కూడా మహేష్ బాబుతో భారీ బడ్జెట్ తో రామాయణం నేపథ్యంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

అయితే ఈ కథ కూడా మహేష్ కు నచ్చిందట.కానీ ఇంకా మహేష్ బాబు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్.ఈ సినిమాకు సంబంధించి మహేష్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది.
అయితే ఇంకా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే అప్పుడే సీత పాత్రలో ఎవ్వరు నటించబోతున్నారనే వార్త పై బాలీవుడ్ లో చర్చ జరుగుతుంది.ఈ సినిమాలో సీత పాత్రలో దీపికా పదుకొనె ని సంప్రదిస్తున్నారట.
అలాగే రావణుడిగా హృతిక్ రోషన్ ను ఒప్పించే పనిలో నిర్మాత ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాను నిర్మాత మధు మూడు సంవత్సరాలుగా ప్లాన్ చేస్తున్నారు.
అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా తో కలిసి మధు ఈ సినిమాను అధికారికంగా కూడా ప్రకటించారు.ఈ సినిమాను మూడు భాగాలుగా తీస్తామని ప్రకటించారు.
అయితే ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో మళ్ళీ మహేష్ సినిమాపై ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయం గా కనిపిస్తుంది.