గచ్చిబౌలి: మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… 2021 టీ 20 వరల్డ్ కప్ సందర్భంగా కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగ్ ను గుట్టు రట్టు చేసిన మాదాపూర్ SOT పోలీసులు.గచ్చిబౌలిలోని TNGO’S కాలనీ లో ఉన్న విహంగ్ హాస్టల్ లో కొనసాగుతున్న బెట్టింగ్.
నిన్న ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కొనసాగిన బెట్టింగ్.పక్కా సమాచారం అందుకుని హాస్టల్ పై దాడి చేసిన SOT పోలీసులు.
రోజుకు 8 వందల రూపాయల చొప్పున నెల రోజుల పాటు రూమ్ ను అద్దెకు తీసుకున్న బెట్టింగ్ ముఠా.
బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన ఆర్గనైజర్ ఖాసిఫ్ ఉమర్ తో పాటు మరో ఇద్దరు మెయిన్ బుకీలు పరారీలో ఉన్నారు.
ఇద్దరు బూకీలు మరో సబ్ బూకి లతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.లైవ్ లైన్ గురు, క్రికెట్ బజ్, క్రికెట్ మజా యాప్ లతో బెట్టింగ్.
ఒకేసారి 2 వందల మందితో బెట్టింగ్ నిర్వహించేలా చర్యలు.బెట్టింగ్ అమౌంట్ మొత్తం ఆన్ లైన్ లోనే చేస్తున్న ముఠా.
నిందితుల వద్ద నుండి15 లక్షల నగదు, 11 స్మార్ట్ ఫోన్ లు, కమ్యూనికేట్ బోర్డు, 3 ల్యాప్‌టాప్ లు స్వాధీనం.గూగుల్ యాప్ లోంచి మూడు యాప్ లను తొలగించేలా లేఖ రాస్తామంటున్న పోలీసులు.
నిందితుల పై పీడియాక్ట్ ప్రపోజల్ పెడుతామంటున్న పోలీసులు.పిల్లలపై పేరెంట్స్ కన్నేసి ఉంచాలి.ఎప్పటికప్పుడు వారితో మాట్లాడటం చేస్తూ ఉండాలి.బెట్ 365, డ్రీం 11, ఎంపిఎల్ బెట్ వే, డ్రీం గురు, మై 11 సర్కిల్, 777 బెట్ ఇలాంటి యాప్ లను తొలగించుకోవాలి.