టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి( Naveen Polishetty, Anushka Shetty ) కలిసి నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.ఈ సినిమాకు పి మహేష్ బాబు( Mahesh Babu ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.ఈ సినిమా రేపు అనగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో సోమవారం చిత్ర దర్శకుడితో కలిసి విలేకర్లతో ముచ్చటించారు నవీన్ పొలిశెట్టి.
ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.ఓ కథ విన్నాక.
వారాలు గడుస్తున్నా మళ్లీ మళ్లీ అదే గుర్తొస్తుందంటే అందులో ఒక మ్యాజిక్ ఉందని అర్థం.
మహేష్ ఈ కథ వినిపించాక నాకు అదే అనుభూతి కలిగింది.తను రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ జానర్‌లోనే ఇంతవరకు రాని ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశాడు.అది నాకు భలేగా అనిపించింది.
అలాగే మా జోడీ యూనిక్‌గా అనిపించింది.సినిమాలో నాకు, అనుష్కకి మధ్య నాన్‌స్టాప్ కామెడీ ( Non-stop comedy )నడుస్తుంది.
ఇది తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడతాయి.భావోద్వేగాలతో నిండిన చిత్రమిది.
ప్రతి ఒక్కరూ ఈ కథతో రిలేట్ అవుతారు.అలాగే నటనకూ ప్రాధాన్యముంది తెలిపారు నవీన్.
అలాగే ఈ చిత్రంలో నేను అనుష్కతో కలిసి నటిస్తున్నాని తెలిసినప్పుడు పైకి పెద్దగా స్పందించలేదు కానీ, లోలోపల చాలా సంతోషపడ్డాను.
ఆమె నటించిన అరుంధతి మూవీ నాకెంతో ఇష్టం.అలాంటిది ఆమెతో కలిసి నటించడం చాలా సంతోషాన్నిచ్చింది.మేమే ఈ చిత్రం ఎందుకు చేశామన్నది సినిమా చూశాక మీకు తెలుస్తుంది.
ఈ కథలో నేను స్టాండప్ కమెడియన్‌గా కనిపిస్తాను.దీంతో ప్రేక్షకులకు తెలుగు స్టాండప్ కమెడియన్‌ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.
ఈ పాత్ర కోసం నేను చాలా రిసెర్చ్ చేశాను.నిజమైన స్టాండప్ కామెడీ స్టూడియోలో చిత్రీకరణ జరిపాము అని వెల్లడించారు నవీన్ పొలిశెట్టి.