ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యక్షమైన వింత గుడ్లగూబలు.. చూసి షాకైన స్థానికులు..

సాధారణంగా గుడ్లగూబలు( Owls ) బ్రౌన్ కలర్‌లో కనిపిస్తాయి.కొన్ని ఎరుపు, బూడిద రంగు, నలుపులో కూడా కనిపిస్తాయి.

 Locals Shocked To See Strange Owls Seen In Uttar Pradesh,  White Owls, Uttar Pra-TeluguStop.com

అయితే తెలుపు రంగు గుడ్లగూబలు కూడా ఉంటాయి కానీ ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి.అలాంటి అరుదైన వాటిని చూసే అవకాశం తాజాగా ఉత్తరప్రదేశ్‌( Uttar Pradesh )లోని ఒక గ్రామస్తులకు దొరికింది.

ఈ గ్రామస్తులు తాజాగా రెండు తెల్ల గుడ్లగూబలను ఒక చెట్టుపై చూసి ఆశ్చర్యపోయారు.ఈ గుడ్లగూబలు చాలా అరుదు, సాధారణంగా ఐరోపా లేదా హిమాలయాలలోని ఎత్తైన పర్వతాలలో నివసిస్తాయి.

ఓ ఇంటి సమీపంలోని చెట్టుపై కూర్చున్న వీటిని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.కొందరు వీడియో రికార్డ్ చేశారు.

ఆ వీడియోను ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ పోస్ట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీనిని వీక్షించారు, తెల్ల గుడ్లగూబల గురించి మరింత తెలుసుకోవాలనుకున్నారు.

అటవీ శాఖ అధికారులు కూడా వీడియో చూసి గుడ్లగూబలు గ్రామంలోకి ఎలా వచ్చాయో.ఎక్కడి నుంచి వచ్చాయో అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఈ వీడియో క్యాప్షన్‌లో చాలా వివరాలను వెల్లడించింది.ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ఈ తెల్ల గుడ్లగూబలు కనిపించాయని తెలిపింది.తెల్ల గుడ్లగూబను చూస్తే చాలా శుభప్రదమని స్థానికులు బావి భావిస్తారని కూడా వెల్లడించింది.ఉత్తరప్రదేశ్‌లో తెల్ల గుడ్లగూబ కనిపించడం ఇదే మొదటిసారి కాదు.2023లో, కాన్పూర్‌లోని ఒక దుకాణదారుడు తన దుకాణం షట్టర్‌పై తెల్ల గుడ్లగూబను గుర్తించి అటవీ శాఖకు ఫోన్ చేశాడు.అధికారులు వచ్చి గుడ్లగూబకు కండువా కప్పి పట్టుకున్నారు.

వారు గుడ్లగూబను అలెన్ ఫారెస్ట్ జూకి తీసుకెళ్లారు, అయితే గుడ్లగూబ ఆరోగ్యంగా ఉందని, గాయపడలేదని జూ సిబ్బంది చెప్పారు.గుడ్లగూబను పంజరంలో ఉంచవద్దని, విడిచిపెట్టాలని చెప్పారు.అధికారులు అంగీకరించి గుడ్లగూబను జూ సమీపంలోని అడవిలోకి వదిలేశారు.

తెల్ల గుడ్లగూబ( White owl )లను కనుగొనడం, లెక్కించడం సులభం కాదు.ఇవి సాధారణంగా సుదూర ప్రదేశాలలో నివసిస్తాయి, శీతాకాలంలో అనేక ప్రదేశాలకు తిరుగుతాయి.పార్ట్‌నర్స్ ఇన్ ఫ్లైట్ అనే బృందం ప్రపంచంలో దాదాపు 29,000 తెల్ల గుడ్లగూబలు ఉన్నాయని అంచనా వేసింది.

ఈ గుడ్లగూబలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని, వాటి బారిన పడకుండా కాపాడాలని కోరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube