లైఫ్ అనుభవించు రాజా  చిత్రాన్ని ఎన్టీఆర్ కి అంకితమిచ్చిన దర్శకుడు... 

టాలీవుడ్ లో ప్రస్తుతం నూతన దర్శకుడు సురేష్ తిరువూరు “లైఫ్ అనుభవించు రాజా” అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు.ఈ చిత్రంలో హీరోగా నూతన రవితేజ నటిస్తున్నాడు.

 Life Anubhavinchu Raja Movie News-TeluguStop.com

రవితేజ సరసన శ్రావణ్ నిక్కీ, శృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా సురేష్ తిరువూర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఈ ఈ చిత్ర టైటిల్ విషయం గురించి మాట్లాడుతూ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి మనుషులంతా ఒక్కటే అనే పాట ఆధారంగా ఈ చిత్ర టైటిల్ ని ఖరారు చేసినట్లు చెప్పుకొచ్చాడు.

అంతేగాక ఈ చిత్రాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఇస్తున్నట్లు తెలిపారు.అలాగే ఈ చిత్రం ఓ యువకుడు తన జీవితంలో పడినటువంటి కష్టాలను, ఒడిదొడుకులను ఎదుర్కొని కోటీశ్వరుడుగా ఎదిగి తన జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనే అంశంపై ఈ చిత్రం తెరకెక్కించామని ఖచ్చితంగా ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ప్రతి ఒక్కరు సినిమా థియేటర్లకు వెళ్లి చూడాలని కోరారు.

Telugu Raviteja, Sruthi Shetty, Tollywood-Movie

అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా ఈ నెల 14వ తారీకు న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే  ఈ నూతన దర్శకుడిని తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube