యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr ntr )రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహాద్రి సినిమాలో భూమిక సింహాద్రిని ఇంటర్వెల్ లో పొడిచి ఒకింత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.అప్పుడు సింహాద్రి విషయంలో జరిగిందే ఇప్పుడు దేవర విషయంలో జరుగుతోందని తెలుస్తోంది.
దేవర సినిమాలో జాన్వీ కపూర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని భోగట్టా.నెగిటివ్ రోల్ లో జాన్వీ తారక్ కు చుక్కలు చూపించే పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.
దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా క్లైమాక్స్ ట్విస్ట్ ఇదేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.వైరల్ అవుతున్న వార్తల గురించి నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.అక్కడ షూట్ పూర్తైన తర్వాత గోకర్ణలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది.
ఈ సినిమాలో తారక్ లుక్ సైతం అదిరిపోయిందని తెలుస్తోంది.నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.ఎన్టీఆర్ కొరటాల ) Koratala Siva )కాంబో మూవీ జనతా గ్యారేజ్( Janatha Garage ) హిట్ కాగా దేవర సినిమా ఆ సినిమాను మించి ఉంటుందేమో చూడాల్సి ఉంది.తారక్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ మూవీగా దేవర నిలిచే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది.సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ లో అదరగొడతారనే సంగతి తెలిసిందే.దేవర సినిమాలో కూడా తారక్ నెక్స్ట్ లెవెల్ నటనతో మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారక్ స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.ఎన్టీఆర్ పారితోషికం కూడా 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.