కోలీవుడ్ ఇండస్ట్రీ( Kollywood )లో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు విశాల్ఒ కరు.ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక తమిళంలో పాటు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి విశాల్ త్వరలోనే మార్క్ ఆంటోనీ( Mark Antony )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హీరో విశాల్( Hero Vishal ) అవార్డ్స్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా 69వ జాతీయ అవార్డులను( 69th National Awards )ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు అవార్డుల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ ప్రశ్నకు విశాల్ సమాధానం చెబుతూ నా దృష్టిలో అవార్డ్స్ అంటే ప్రేక్షకులు అభిమానులు మన సినిమాలకు ఇచ్చే ప్రశంసలు మాత్రమే అవార్డులతో సమానంగా భావిస్తానని ఈయన తెలిపారు.
ప్రేక్షకులు అభిమానుల ఆశీర్వాదం వల్ల నేను ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నానని తెలిపారు.ఇక నాకు సినిమాల పరంగా ఇచ్చే అవార్డులు అంటే చెత్తతో సమానమని అవార్డులపై నాకు నమ్మకం లేదని ఈయన తెలియజేశారు.ఒకవేళ నేను నటించిన సినిమాలకు కనుక అవార్డులు వస్తే వాటిని చెత్త బుట్టలో పడేస్తాను అంటూ ఈ సందర్భంగా విశాల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్( Social Media ) అవుతున్నాయి.
అయితే సినిమా ఇండస్ట్రీలో సినిమాలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డుల గురించి విషయాలు ఇలా మాట్లాడటంతో పలువురు నెటిజన్స్ ఈయన వ్యాఖ్యలపై భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.