చందా కొచ్చర్ దంపతులు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై బొంబాయి కోర్టులో విచారణ జరిగింది.ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం కొచ్చర్ దంపతుల కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది.
ఈనెల 26తో చందా కొచ్చర్ దంపతుల కస్టడీ ముగిసింది.అయితే వీరు విచారణకు సహకరించడం లేదని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.
దీంతో ఈనెల 28 వరకు కస్టడీ పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.కాగా ఈనెల 24న చందాకొచ్చర్ దంపతులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.రూ.3,250 కోట్ల వీడియో కాన్ రుణ కుంభకోణంలో వీరిని అరెస్ట్ చేశారు.వీడియోకాన్ కు రుణం ఇవ్వడంతో ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.1,730 కోట్ల నష్టం వాటిల్లింది.అయితే తమను అక్రమంగా అరెస్ట్ చేశారని, బెయిల్ ఇవ్వాలని కొచ్చర్ దంపతులు పిటిషన్ లో కోరారు.ఈ కుంభకోణంలో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.