జనసేన తాము కలిసి పోటీ చేస్తామని , ఇందులో మరో మాటకు అవకాశం లేదని పదేపదే బిజెపి రాష్ట్ర నాయకులతో పాటు, ఆ పార్టీ జాతీయ నాయకులు ప్రకటిస్తూనే ఉన్నారు.అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వేరే రకంగా ఆలోచిస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వకుండా చూస్తానని, దీనికోసం ఏం చేసేందుకైనా సిద్ధమంటూ పరోక్షంగా టిడిపి తో పొత్తు విషయాన్ని పవన్ ప్రకటిస్తున్నారు.ఈ విషయంలో అటు టిడిపి , ఇటు జనసేన కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
పవన్ బిజెపితో కలిసి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు .ఏ కార్యక్రమమైనా జనసేన అటు బిజెపి విడివిడిగానే నిర్వహిస్తున్నాయి తప్ప, ఉమ్మడిగా తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లడం లేదు.
అది కాకుండా, ఏపీలో పెద్దగా బలం లేని బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా నష్టమే తప్ప కలిసి వచ్చేది ఏమీ లేదని పవన్ సైతం భావిస్తున్నారు.ఈ క్రమంలోనే రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని తాజా నిర్ణయించుకున్నారట.
ఈ విషయంలోనే రెండు పార్టీల మధ్య సరైన క్లారిటీ రావడంలేదనేది సమాచారం. టిడిపి పొత్తులో భాగంగా తమకు 40 స్థానాలను కేటాయిస్తే చాలు అన్నట్లుగా జనసేన ఉంది.
దాంట్లో కనీసం 30 స్థానాలు అయినా విజయాన్ని దక్కించుకుంటామనే నమ్మకంతో ఉండగా టిడిపి మాత్రం 15, 20 స్థానాల్లో పై మాత్రమే జనసేనకు ఇచ్చేందుకు మొగ్గు చూపిస్తోందట.ఈ విషయంలోనే రెండు పార్టీల మధ్య క్లారిటీ రాకపోవడంతో పొత్తుల అంశంపై స్పష్టత కొరవడిందట.
టిడిపి నేతలు సైతం పొత్తుల అంశాన్ని త్వరగా తేల్చాలని అధినేతపై ఒత్తిడి చేస్తున్నారట.
ఇప్పటికే చాలామంది నియోజకవర్గ ఇన్చార్జీలు క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపించక పోవడానికి కారణం ఈ పొత్తులు వ్యవహారమేనట. ఎలాగూ పొత్తు ఉంటుంది కాబట్టి, ఏ స్థానాలను జనసేనకు కేటాయిస్తారో ముందుగా ఒక క్లారిటీ వస్తే మిగతా చోట్ల దూకుడుగా జనాల్లోకి వెళ్ళేందుకు , సొమ్ములు ఖర్చు పెట్టేందుకు నాయకులు ముందుకు వస్తారని, అలా కాని పక్షంలో పార్టీ కార్యక్రమాల నిమిత్తం భారీగా సొమ్ములు ఖర్చుపెట్టినా చివరి నిమిషంలో ఆ నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తే అప్పటివరకు పెట్టిన ఖర్చు మొత్తం వృధాగా మారుతుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిలు అభిప్రాయపడుతున్నారట.